గోవా బ్యూటీ ఇలియానా (Ileana) గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హీరోయిన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.
5 రోజుల కిందటే ఇలియానా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆగస్టు 1న తనకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించింది. అంతేకాదు బాబుకు పేరు కూడా పెట్టారు. ఇలియానా కొడుకు పేరు “కో ఫీనిక్స్ డోలన్”.
తన బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించినందుకు తాను ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేనని ఇలియానా తెలిపింది. తమ హృదయాలు ఆనందంతో నిండిపోయాయని ప్రకటించారు.
ఇలియానా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు ప్రకటించిన హీరోయిన్.. ఆ పాప తండ్రి ఎవరో మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత అంచెలంచెలుగా తన ప్రియుడు ఎవరో బయటపెట్టింది. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు.
అంతే కాకుండా ఆ ప్రియుడు పెళ్లి చేసుకున్నాడా లేదా అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. చివరకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా విషయం వెంటనే చెప్పలేదు. మరి పెళ్లి, బిడ్డ విషయంలో ఇంకెన్ని షాక్‌లు వస్తాయో చూడాలి.