Sunday, May 12, 2024
Homecinemasalman khan : 57వ పుట్టిన రోజు జరుపుకున్న సల్మాన్ ఖాన్ గురించి కొన్ని విషయాలు మీ కోసం..

salman khan : 57వ పుట్టిన రోజు జరుపుకున్న సల్మాన్ ఖాన్ గురించి కొన్ని విషయాలు మీ కోసం..

Telugu Flash News

సల్మాన్ ఖాన్ (salman khan) ,సినీ పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 35 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ అభిమానులలో, ప్రేక్షకులలో ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోలలో ఒకరిగా నిలుస్తూ వచ్చారు. అలాంటి ఎనర్జిటిక్ యాక్టర్ అయిన సల్మాన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.

స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ కి పెద్ద కొడుకు అయిన సల్మాన్ ఖాన్ 1965,డిసెంబర్ 27న సలీం ఖాన్ మరియు తన మొదటి భార్య సుషిలా చరక్ లకు జన్మించాడు.

తన తండ్రి సినీ పరిశ్రమకి చెందిన వాడు కావడంతో చిన్నప్పటి నుంచి నటనపై ఇష్టం పెంచుకున్న సల్మాన్ ఖాన్ మొదట్లో చదువులో బానే రాణిస్తూ తన ప్రాథమిక విద్యను బాంద్రా లోని సెయింట్ స్టానిస్లాస్ హై స్కూల్లో పూర్తి చేసుకున్నాడు.ఆ తరువాత st.xaviers కాలేజీలో చేరిన ఆయన కొన్ని కారణాల వల్ల తన చదువుని మధ్యలోనే ఆపేశాడు.

సినీ ప్రయాణం:

చదువుని మధ్యలోనే వదిలేసిన సల్మాన్ తన దృష్టిని నటన వైపు మళ్ళించాడు. ఆ విధంగా 1988లో విడుదలైన బీవీ హై తో ఐసి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు.

వచ్చిన ఏడాదికే అందర్నీ ఆశ్చర్య పరిచే రీతిలో 1989లో విడుదలైన “మైనే ప్యార్ కియా” సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సల్మాన్ అందరి ప్రశంసలు అందుకోవడమే కాక తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించాడు.

అంతే కాకుండా ఆ సినిమాలో నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకుని అందర్నీ అవాక్కయేలా చేసాడు.ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ సినిమా మన తెలుగులో “ప్రేమ పావురాలు” అనే పేరుతో రీమేక్ కూడా అయ్యింది.

-Advertisement-

ఆ విజయంతో వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టిన సల్మాన్ కుర్బాన్,సాజన్,అమీర్ ఖాన్ తో అందాజ్ అప్నా అప్నా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ దిల్ దే చుకే సనం లాంటి ఎన్నో మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు.

కేవలం వెండి తెరకు మాత్రమే పరిమితం కాకుండా 2010 నుంచి బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్ కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.

అయితే ఇటీవలే కాలంలో తన సినిమాలు ఎవరికీ నచ్చకపోవడంతో సల్మాన్ జోరు తగ్గగా, మళ్ళీ సల్మాన్ మంచి సినిమాలలో నటిస్తాడని,అందర్నీ అలరిస్తాడని ఆయన అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.

ఈ రోజు మంగళవారం 27 december 2022, సల్మాన్ ఖాన్ తన 57వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు ముంబైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సల్మాన్‌కి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని వేలాది మంది గుమిగూడారు. ఈ క్రమంలో సల్మాన్ తన బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేశాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సల్మాన్. అభిమానుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

సల్మాన్ ని  జైలు పాలు చేసిన సంఘటన:

సల్మాన్ సినిమాల్లో మంచి విజయాలను అందుకుంటున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటన వలన ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. 2015లో సల్మాన్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ఐదుగురిపై కారును ఎక్కించేసాడు. దీంతో ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా,ఒక వ్యక్తి మృతి చెందాడు. కాగా నేరానికి పాల్పడిన సల్మాన్ కి అప్పీల్పై తీర్పును పక్కన పెట్టారు.

ఈ సంఘటన జరిగిన 3 ఏళ్ల తరువాత 2018లో సల్మాన్ కృష్ణ జింకను వేటాడి చంపిన నేరం కింద కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సారి కోర్టు ఆయనికి 5 ఏళ్ల జైలు శిక్ష విదించడంతో జైలుకి వెళ్లిన సల్మాన్ ప్రస్తుతం బెయిల్ పై బయటకి తిరుగుతున్నాడు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News