Homecinema#RC15 : డ్యూయల్ రోల్ లో కనిపించనున్న రామ్ చరణ్..రాజమండ్రి లో లేటెస్ట్ షెడ్యూల్..

#RC15 : డ్యూయల్ రోల్ లో కనిపించనున్న రామ్ చరణ్..రాజమండ్రి లో లేటెస్ట్ షెడ్యూల్..

Telugu Flash News

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌(Ram Charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ #RC15లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

శంకర్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న #RC15 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఆదివారం ఉదయం రాజమండ్రి బయలుదేరారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ మూవీ లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అతను చేయనున్న రెండు లుక్స్‌లో చాలా వేరియేషన్ కనిపించనుంది . ఇందులో ఒక లుక్‌లో బ్యూరోక్రాట్‌గా కనిపిస్తే, మరో లుక్‌లో క్యాజువల్ లుక్‌లో కనిపించనున్నాడు.

ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో నిర్మించబడుతుంది . కియారా అద్వాణీ(kiara advani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. శంకర్ మార్క్ చిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో శ్రీకాంత్..సునీల్ ..అంజలి కాలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న #RC15 లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ఆదివారం ఉదయం రాజమండ్రి బయలుదేరారు. గ్యాలరీ వీక్షించండి. 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News