శ్యామ్ సింగరాయ్ తో సాలిడ్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మలయాళం హీరోయిన్ నజ్రియా నజీమ్ ఈ రొమాంటిక్ కామెడీ మూవీ తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్బంగా అతని అభిమానులను ప్రత్యేకంగా ఆశ్చర్యపరిచేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. రేపు సాయంత్రం 23న 04:05 గంటలకు ‘అంటే సుందరానికి అప్డేట్ ‘సుందర్ బార్త్డే బ్లాస్ట్’ ప్రకటించబడుతుందని మేకర్స్ ఫన్నీ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ క్రియేటివ్ ప్రమోషన్ ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. రేపు ‘సుందర్ బార్త్డే బ్లాస్ట్’ పై ఆసక్తిగా ఎదురుచూసేలా ఉంది.
మెంటల్ మదిలో మరియు బ్రోచేవారెవరురా చిత్రాలను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు . ఈ రొమాంటిక్ కామిడీ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.