Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 దసరా ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో హౌజ్‌మేట్స్ తో సందడి చేసిన నాగార్జున మధ్యలో వారిపై గుస్సా కూడా అయ్యాడు. ముఖ్యంగా గీతూపై అరిచేశాడు. చంటి విషయం గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి సారి గీతూ మధ్యలో దూరుతుండడంతో నాగార్జున ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో తన ఘోస్ట్ మూవీని ప్రమోట్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా ట్రైలర్ ను హౌస్ మెంట్స్ కు చూపించగా, వారు ఇది చాలా బాగుందని మరో సారి చూపించాలని కూడా కోరారు.
ఆరోహి ఎలిమినేషన్..
ఇక సినిమా రిలీజ్ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తున్నానంటూ ప్రవీణ్ సత్తారు చెపుతూ.. లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను అని అనడంతో, వెంటనే నాగ్ లిక్విడ్స్ అంటే అవేనా అంటూ సెటైర్ వేశాడు. ఇక సోనాల్ వచ్చి రావడంతోనే నాగార్జునపై ప్రశంసలు కురిపించింది. సినిమాలోనే కాదు బయట కూడా నాగ్ సార్ బెస్ట్ అంటూ కామెంట్ చేసింది. ఘొస్ట్ టీమ్‌కి బైబై చెప్పాక హౌజ్‌మేట్స్‌తో గేమ్ ఆడించాడు నాగార్జున. బాయ్స్, గర్ల్స్ టీమ్‌లుగా డివైడ్ చేసి పలు గేమ్ ఆడించి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. ఇక . ఈ ఆటలు తరువాత ఒక్కొ పెట్టే చేతికి ఇచ్చి.. ఇందులో రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు.
బతుకమ్మ పాటలకు హౌస్‌లోని కంటెస్టెంట్స్ డ్యాన్స్ వేసి అలరించారు. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరికి ఒక గంట చేతికి.. గంట మోగించిన గలాట గీతూ సేవ్ అయినట్లు నాగార్జున తెలిపారు. ఇక చివరిగా సుదీపతో పాటు ఆరోహి మిగిలి ఉండగా.. ఇద్దరిలో ఆరోహీకి ఓటింగ్ తక్కువగా రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక స్టేజ్ మీదకు వెళ్లాక శ్రీహాన్ గురించి పొగడ్తలు కురిపించింది. శ్రీహాన్ అంత మంచివాడిని చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. కీర్తి ఎవరి గురించి చెప్పదు అని చెప్పిన ఆరోహి, సూర్యని చూసి ఎమోషనల్ అయింది. ఇక తనకు మంచి ఫ్యామీలీ దొరికిందని..బయటికి వచ్చాక అందరం కలవాలని చెప్పి బిగ్ బాస్ హౌజ్ ని వీడింది.