Tuesday, May 14, 2024
Homenationalజైలు నుంచి బైటికి రాగానే భార్యను తుపాకీ తో కాల్చి చంపాడు 🔫

జైలు నుంచి బైటికి రాగానే భార్యను తుపాకీ తో కాల్చి చంపాడు 🔫

Telugu Flash News

తన భార్య తనను మోసం చేస్తుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీ తో కాల్చి చంపాడు. పదిహేను రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్ కూడా భార్యే ఇవ్వడం గమనార్హం. రద్దీగా ఉండే మార్కెట్‌ లో తన భార్యను కాల్చి చంపాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం బరేలీలోని ఫతేగంజ్ వెస్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

నిందితుడు కృష్ణపాల్ లోధి తన భార్య పూజపై పలు రౌండ్ల బుల్లెట్ కాల్పులు జరిపాడు. ఆమెతో పాటు పూజ ఫ్రెండ్ మున్నా(30)పై కూడా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పూజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం,

విచారణలో కృష్ణపాల్ ఇలా చెప్పాడు.. తన భార్య తనను మోసం చేసిందని , అందుకే ఆమెను కాల్చానని చెప్పాడు.”ఆమె చనిపోవడానికి అర్హురాలు, అందుకే నేను ఆమెను చంపాను, నాకు ఎటువంటి భాధ లేదు” అని కృపాపాల్ అన్నారు.

ఇక , పూజ, కృపాపాల్ ల ప్రేమ వివాహం. పూజ, కృష్ణపాల్‌లు 2012లో ఇంటి నుంచి పారిపోయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం ఆమె బ్యూటీ పార్లర్‌ను నడిపేది. కృష్ణపాల్ గతంలో హత్యాయత్నం కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఘటన జరిగిన వెంటనే హత్యాయుధంతో పట్టుబడ్డాడు. ఎస్పీ (నగరం) బరేలీ, రాహుల్ భాటి మాట్లాడుతూ, “నిందితుడిని జైలుకు పంపారు. IPC సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.” అని చెప్పారు.

-Advertisement-

దీనిపై పూజ తల్లి షీలాదేవి మాట్లాడుతూ.. ” క్రిష్ణపాల్ మద్యానికి బానిసై రోజూ రాత్రి నా కూతురిని కొట్టేవాడు. శనివారం కృష్ణపాల్ తాగి ఇంటికి వచ్చి మైనర్ కొడుకుల ఎదుట పూజను తిట్టాడు. దీంతో ఆగ్రహించిన అతడు కంట్రీ మేడ్ పిస్టల్‌ను బయటకు తీశాడు. పూజ భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. కానీ అతను ఆమెను వెంబడించి కాల్చి చంపాడు, ”ఆమె విలపించింది.

read more news :

Prabhu Deva : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన ప్రభుదేవా.. ఇప్పుడు ఇదే వైరల్ న్యూస్

Ginger Tea Benefits : అల్లం టీ తాగడం వల్ల కలిగే 9 ఆరోగ్య ప్రయోజనాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News