INDvsENG: సెమీస్ రెండవ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మధ్య జరగగా, ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోసారి టైటిల్ గెలిచే సువర్ణవకాశం ఉన్నప్పటికీ చెత్త ఆటతో టైటిల్ చేజార్చుకుంది. దాంతో భారత క్రికెట్ అభిమానులంతా బాధపడుతుంటే.. కొందరు మాత్రం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందే మంచిదయ్యిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి చెత్త టీమ్‌తో ఫైనల్ చేరి.. పాకిస్థాన్ చేతిలో ఓడితే ఆ ఓటమిని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్లమని, ఆ పరాభావం మరి దారుణంగా ఉండేదని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇదే మంచిది..
చెత్త ఓపెనింగ్‌తో సెమీస్‌కు చేరడమే గొప్ప విషయమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసంతో భారత ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా కనబరచలేకపోయారు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆట చూసి మ్యాచ్ పోయినట్టేనని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినట్టు కనిపించారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్నవాళ్లు కూడా పరుగెత్తడానికి, బంతిని ఆపడానికి పెద్దగా కష్టపడలేదు కాదు కాని కనీసం ప్రయత్నించలేదు. భారత జట్టులో కనిపించిన ఈ యాటిట్యూడ్… సగటు క్రికెట్ ఫ్యాన్‌కి ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.
జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకపోయినా యజ్వేంద్ర చాహాల్ ఆడకపోయినా సెమీ ఫైనల్ వరకూ అయితే ఎలాగోలా చేరుకుంది భారత జట్టు. కారణం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చూపించిన మాస్టర్ క్లాస్ బ్యాటింగేనని సెమీ ఫైనల్ వైఫల్యం మరోసారి రుజువు చేసిందనే చెప్పాలి.. బౌలింగ్‌కి అనుకూలించిన పిచ్‌పై వికెట్లు తీయడం, బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం తప్ప… భారత బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది ఎక్కడా కనిపించింది లేదు. నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి చిన్న టీమ్స్‌పై చెలరేగిన మన బౌలర్లు… సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు అనేది క్లియర్‌గా కనిపించింది. ఈ ప్లేయర్స్‌ని మార్చాల్సిన సమయం వచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
also read news:
Yashoda Movie Review : సమంత ‘యశోద’ మూవీ రివ్యూ..
Bigg Boss 6: కెప్టెన్సీ ఫైట్.. రచ్చగా మారిన గేమ్.. రేవంత్ రూల్స్‌తో విసిగిపోయిన రోహిత్