Horoscope Today:
మేష రాశి :
మేషరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికముగా ఉండును. పనులు ఒత్తిడి ఎక్కువ. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది.
వృషభ రాశి :
ఈరోజు శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసిక అలసట ఏర్పడుతుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు.
మిథున రాశి :
ఈరోజు పిల్లల వలన చికాకులు ఏర్పడుతాయి. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడుతుంది.. ప్రయాణమునందు ఖర్చులు అధికమవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం మిథునరాశి వారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం మంచిది.
కర్కాటక రాశి :
ఈ రాశి వారు ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.. కర్కాటక రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేయడం మంచిది.
సింహ రాశి :
ఈ రాశి వారు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది.
కన్య రాశి :
ఈ రాశి వారు ప్రయాణములు ఎక్కువ చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు.ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది
తులా రాశి :
ఈ రాశి వారు ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వీరికి ధనలాభము కలుగుతుంది.. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన మిత్రుల ద్వారా సహాయము పొందుతారు.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము చదువుకోవడం మంచిది
ధనుస్సు రాశి :
ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడుతాయి.
మకర రాశి :
ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివుని పూజ చేయాలి.
కుంభ రాశి :
ఈ రాశి వారు చంద్రుని అనుకూల ప్రభావం చేత ఆనందముగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు కొంత ఒత్తిళ్ళు ఏర్పడుతాయి. కుంభ రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేయడం మంచిది.
మీన రాశి :
ఈ రోజు ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైన ఉంది.