HometelanganaCharminar Express derailed : పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

Charminar Express derailed : పట్టాలు తప్పిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

Telugu Flash News

Charminar Express derailed : హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చెన్నై – హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఆగేందుకు నెమ్మదిగా వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.

హైద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లోకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంతో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఎస్-2, ఎస్-3, ఎస్-6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ లో నిర్ధేశిత ప్రాంతంలో రైలు ఆగాల్సిన ప్రాంతంలో కాకుండా రెండు లేదా మూడు అడుగులు ముందుకు వెళ్లి సైడ్ వెళ్లి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో రైలు కుదుపులకు గురైంది.

అంతేకాదు రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైలులో ఫుట్ బోర్డు చేస్తున్న ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. రైలు నిర్ధేశించిన స్థలంలో కాకుండా ముందుకు ఎందుకు వెళ్లిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

పట్టాలు తప్పిన బోగీలు ప్లాట్ ఫాం సైడ్ వాల్‌ను ఢీకొట్టాయి. దీంతో బోగీలలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంతో సంక్రాంతి పండగా వేళ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది నెలలుగా వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి వారంలో ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద ఘటన వార్తల్లో నిలుస్తుంది.

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News