Health Tips in Telugu : చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పుడు, తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనతో ఆహార పరిమితులు విధించుకుంటారు. అయితే, ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. పోషకాహార నిపుణులు చెబుతున్న కొన్ని డైట్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
బ్రేక్ ఫాస్ట్
బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా చేయాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ తినకుండా, ఇంటి వద్ద తయారుచేసిన ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినండి.
ఉదాహరణకు, ఓట్స్, పండ్లు, పెరుగు, గింజలు, నట్స్ వంటివి తినవచ్చు.
పండ్లు, కూరగాయలు
ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తినాలి.
పండ్లు, కూరగాయల్లో పీచుపదార్ధం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పండ్లు, కూరగాయలు ఆకలిని కూడా తగ్గిస్తాయి.
గింజలు, నట్స్
గుప్పెడు గింజలు, నట్స్ ఆరోగ్యకరమైన చిరుతిండి.
వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఆకలిని తగ్గిస్తాయి.
భోజనం సమయంలో
భోజనం సమయంలో ఫోన్, టీవీ, పుస్తకాలు, పత్రికలు చూడకుండా, మనసు పెట్టి తినాలి.
అప్పుడు మనం ఎంత ఆహారం తినాలనేది తెలుస్తుంది.
రాత్రి భోజనం
రాత్రి భోజనం తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి.
అది కూడా నిద్రకు రెండు లేదా రెండున్నర గంటల ముందే తినాలి.
అప్పుడే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
చక్కగా నిద్రపడుతుంది.
నీళ్ల మోతాదు
రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి.
నీళ్లు తగినంతగా తీసుకుంటే, డీహైడ్రేషన్, ఒంట్లో మలినాలు పేరుకుపోవడం, అలసట, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు వంటివి దరిచేరవు.
ఈ చిట్కాలను పాటిస్తే, ఆరోగ్యంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
also read :
Weight Loss Tips : ఈ పండ్లు తినండి.. బరువు తగ్గండి..!
pepper for weight loss : మిరియాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారా ?
snacks for weight loss : ఆ స్నాక్స్ తింటే వెయిట్ లాస్ గ్యారెంటీ..