తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) గురువారం తెల్లవారుజామున ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అధికారిక నివాసంలోకి అడుగుపెట్టే ముందు భట్టి విక్రమార్క మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ప్రజాభవన్‌లోని హోమగుండంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రజాభవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించింది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సమేతంగా గురువారం ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు.
ప్రజాభవన్ లో భట్టి ప్రత్యేక పూజలు#battivikramarka #prajabhavan #TelanganaNews pic.twitter.com/o9y0bINszg
— Zee Telugu News (@ZeeTeluguLive) December 14, 2023
భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి?