HomehealthPeepal Leaf benefits : రావి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు..

Peepal Leaf benefits : రావి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు..

Telugu Flash News

Peepal Leaf benefits : రావి ఆకులు ఆయుర్వేదంలో చాలా శతాబ్దాలుగా వివిధ ఔషధాల తయారీకి ఉపయోగించబడుతున్నాయి. రావి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు చాలా రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ నివారణ

రావి ఆకులను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని నీటిలో వేసి మరిగించి తాగితే డయాబెటిస్ తగ్గుముఖం పడుతుంది.

మగవారి ఆరోగ్యానికి

రావి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ముఖ్యంగా మగవారి ఆరోగ్యానికి చాలా మంచివి. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారు రావి ఆకుల కషాయం తాగితే వీర్య వృద్ధి పెరుగుతుంది. నపుంసకత్వం నుంచి బయటపడటానికి కూడా రావి చక్కగా ఉపయోగపడుతుంది. రావి పండ్ల పొడిని పాలలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే నపుంసకత్వం దూరం కావడమే కాకుండా కండర పుష్టి కూడా జరుగుతుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

రావి ఆకులు మలబద్ధకం, ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా మంచి పరిష్కారం. దంత సమస్యలు, నోటిపూత, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఉన్నవారు రావి చెట్టు బెరడును నీటిలో ఉడికించి, ఆ నీటిని ఉదయం నోట్లో పోసుకొని పుక్కలించడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి. డయేరియాతో బాధపడేవారు రావి చెట్టు బెరడును దనియాలు, పట్టిక బెల్లం వంటి వాటితో కలిపి పొడిగా చేసి, ఉదయం సాయంత్రం సేవిస్తే డయేరియా తగ్గుతుంది.

అయితే, రావి ఆకులను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News