Homeandhra pradeshChandrababu Naidu : ఖైదీ నంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు..

Chandrababu Naidu : ఖైదీ నంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు..

Telugu Flash News

Chandrababu Naidu :స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని భారీ భద్రత మధ్య రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు బాబు కోసం స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఖైదీ నంబర్ 7691 అతనికి కేటాయించబడింది. రాజమండ్రి జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, చంద్రబాబు ఇంటి భోజనంతో పాటు మందులు ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఖైదీలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే బాబుకు బెయిల్ ఇప్పించేందుకు ఆయన లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

విచారణ నిమిత్తం బాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఆదివారం ఉదయం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సీఐడీ.. 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, విచారణ కోసం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి తీసుకోవాలని కోరారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎట్టకేలకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

-Advertisement-

also read :

Chandrababu Naidu arrest : ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News