Homehoroscopetoday rasi phalalu in telugu : 09/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 09/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

09/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశివారికి నేడు మిశ్రమ కాలం అని చెప్పాలి. కొన్ని కీలక పనుల్లో ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం. ఆరోగ్యం విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం

ఈ రాశి వ్యక్తులు సమావేశాలలో ఆసక్తిగా పాల్గొంటారు. బంధువులు మరియు స్నేహితులతో పండుగ కార్యక్రమాలను ఆనందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. సొంత ఇల్లు కొనుగోలుకి ప్రయత్నాలు చేసి స‌క్సెస్ సాధిస్తారు. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.

మిథునం

ఈ రాశివారు చేపట్టిన పనులను త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ధన లాభం కొంత‌ కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారు. బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించడం ద్వారా, వ్యక్తులు తమ కుటుంబ పెద్దల మన్ననలు మరియు ఆమోదాన్ని పొందగలరు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

కర్కాటకం

ఈరోజు ఈ రాశివారు ధన లాభం పొందే అవ‌కాశం ఉంటుంది.. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన‌డం చేస్తారు. కీలక వ్యవహారాలలో ఆటంకం కలగకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

today horoscope

-Advertisement-

సింహం

ఈ రాశి వ్యక్తులు ఈ రోజు ఒక ముఖ్యమైన పనిని సమర్థవంతంగా సాధించే అవకాశం ఉంది. పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అలసట పెరగకుండా చూసుకోవ‌డం మంచిది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం ఉత్త‌మం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

కన్య

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తుల ఆర్జనకు సంబంధించి పురోగతి ఉంటుంది. బంధు మిత్రుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

తుల

ఈ రోజు ఈ రాశివారు వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం

ఈరోజు ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ల‌భిస్తాయి.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం చేస్తారు. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మరియు మీరు చేసే కొనుగోలు వల్ల లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

rasi phalalu today horoscope

ధనుస్సు

ఈరోజు ఈ రాశివారు సకాలంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలో కొంత‌ ఇబ్బంది పడతారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు చేయాకుండా ఉండాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

మకరం

ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొనే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. పని తీరుతో అందరి ప్రశంసలను పొందుతారు. అవసరానికి తగిన సహాయం ద‌క్కుతుంది. మానసికంగా సుఖశాంతులతో గడుపుతారు.చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం

ఈ రోజు ఈరాశివారికి బాధ్యతలు ఎక్కువ‌ పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్తలు వింటారు. ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు..

మీనం

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా క‌లుగుతుంది.. కుటుంబ సభ్యుల సలహాతో ముందుకు వెళ‌తారు. శారీరక శ్రమ ఎక్కువ‌గా ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News