Crime News : సోషల్ మీడియాలో సంపన్నులతో టచ్ లో ఉండి ప్రేమ పేరుతో వల విసురుతుంది..పెళ్లి చేసుకుని కాపురానికి వస్తుంది. మంచి రోజు చూసి ఆమె ఇంట్లో దాచిన డబ్బు, నగలతో జంప్ అవుతుంది. చెన్నైకి చెందిన ఓ యువతి చేసిన ఘరానా మోసం ఇది. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఎనిమిది మంది మోసపోయారు. తాజాగా ఒక భాదితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. పరారీలో ఉన్న కిలేడి కోసం చెన్నై పోలీసులు గాలిస్తున్నారు.
తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళకు చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీదా అనే యువతి పరిచయమైంది. ఇలా మొదలైన ఈ పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి ఈ సంవత్సరం మార్చి 30,2023 న వివాహం చేసుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాక ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.. ఈ నెల 4న రషీదా ఇంట్లో రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు ఆభరణాలతో అదృశ్యమైంది. మూర్తి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు.
నీలగిరి జిల్లా గూడలూరుకు చెందిన రషీదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డబ్బున్న వ్యక్తులతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వారితో నిత్యం చాటింగ్ చేసేదని పోలీసులు తేల్చారు. పెళ్లయ్యాక ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని పారిపోయేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు వెల్లడైంది.
also read :
Crime News : పదో తరగతి బాలికపై ముగ్గురు స్నేహితుల అత్యాచారం
cyber crime : కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు