HometelanganaGanja Smuggling : గంజాయి రవాణా చేస్తున్న మహిళల అరెస్టు🚔

Ganja Smuggling : గంజాయి రవాణా చేస్తున్న మహిళల అరెస్టు🚔

Telugu Flash News

Ganja Smuggling : మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు.

నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఆటోనగర్ కు చెందిన ఫరీదాబేగం, రషీదాబేగం అనే ఇద్దరు మహిళలు నాందేడ్ జిల్లాలో రూ.11వేలకు గంజాయిని నిజామాబాద్ కు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ ఎస్‌ఎస్‌ మల్లేష్‌ను అభినందించారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ గంజాయి కొనుగోలు, విక్రయాలపై ఎవరికైనా తెలిసిన వారు ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలన్నారు.

also read :

KCN Mohan passes away : 🪔ప్రముఖ నిర్మాత కన్నుమూత😭

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News