Robbery : ఒక దొంగ దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఫోన్ చూస్తుండగా.. బ్యాటరీ డెడ్ అయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి తన పని తాను చేసుకోవాలి అనుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇంట్లో ఉన్న ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి సొత్తు చోరీ చేసేందుకు ఇంటి చుట్టూ తిరిగాడు. ఇంతలో ఇంటి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. దొంగ పరారయ్యాడు. అయితే, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు . ఇంటి యజమాని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పట్టణంలోని సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ తన కుటుంబంతో సహా నివాసం ఉంటున్నట్లు పోలీసుల కథనం. అయితే ఇంటి యజమాని, అతని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు దొంగలు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. వారి మొబైల్ ఫోన్ బ్యాటరీ అయిపోయినందున,వారు ఫోన్ కి చార్జింగ్ పెట్టి, దొంగతనం చేసే పనిలో పడ్డారు . బీరువా పగులగొట్టి 12 తులాల బంగారం, 69 తులాల వెండి, రూ. 24,000 నగదు దొంగిలించారు .
వ్యక్తిగత పనుల నిమిత్తం తాత్కాలికంగా బయటకు వెళ్లిన ఇంటి యజమాని అనూహ్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఇది గమనించిన దొంగలు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంటి యజమాని దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే తాము చార్జింగ్ పెట్టుకున్న సెల్‌ఫోన్‌ను దొంగలు నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు . కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరితగతిన దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సెల్‌ఫోన్ ద్వారా లభించిన ఆధారాలతో కేసును ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
read more news :
arvind kejriwal : గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్🧐
Bhagavanth Kesari Teaser : 👌తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య😎.. ‘భగవంత్ కేసరి’ టీజర్ సూపర్బ్..