Restaurant : ఇంట్లో వండింది నచ్చనప్పుడో.. ఏదైనా పార్టీ చేసుకోవాలన్నపుడో చాలా మంది హోటల్ కి వెళ్తుంటారు. ఇతర ప్రాంతాలకు వెళితే రెస్టారెంట్లలో తినక తప్పదు. నలుగురు విద్యార్థులు కలిస్తే ఉండే సరదా మామూలుగా ఉండదు. అలా వారు తినడానికి ఒక రెస్టారెంట్‌కి వెళ్లి మీల్స్ ఆర్డర్ చేశారు. ఆఖరికి ఇచ్చిన బిల్లు చూడగానే వాళ్ళకి బుర్ర పాడైపోయింది.
ఎక్కడైనా భోజనం ఖరీదు నలుగురు తింటే వెయ్యి లేదా ఎక్కువ అయితే ఐదు వేలు ఉంటుంది . కానీ ఇక్కడ బిల్లు మాత్రం దాదాపు అక్షరాల లక్ష రూపాయలు. అయితే ఆ రెస్టారెంట్ తమను మోసం చేసిందని ఆ నలుగురు విద్యార్థులు అర్థం చేసుకుని ఆ హోటల్ వాడికి బుద్దిచెప్పారు. ఈ ఘటన ఇటలీలో జరిగింది.
జరిగిన సంగతి ఏంటంటే.. జపాన్ కు చెందిన నలుగురు విద్యార్థులు టూర్ కోసం ఇటలీ వెళ్లారు. ఓ రోజు అక్కడి ప్రముఖ రెస్టారెంట్‌కి భోజనానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం కోసం వారు నాలుగైదు వెరైటీ లు ఆర్డర్ చేశారు. భోజనం చేసి ఆ తర్వాత బిల్లు చూసి షాక్ అయ్యారు. సుమారు రూ.లక్ష బిల్లు వచ్చింది. అసలు ఎంత తిన్నామో తెలుసుకుని , బిల్లు ఇంతలా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. బిల్లుపై రెస్టారెంట్ ఉద్యోగులను అడిగి కడిగి పారేశారు .
అయితే రెస్టారెంట్ సిబ్బంది చెప్పిన విషయం విని విద్యార్థులు షాక్ అయ్యారు. ఇంటర్నెట్ మరియు ఇతర సౌకర్యాల పేరుతో ఛార్జీలు వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో వారు ఏమి చేయలేక తర్వాత వీడి సంగతి చూసుకుందామని బిల్లు చెల్లించి అక్కడినుండి వెళ్లిపోయారు.
ఇలా ఇంత బిల్లు వేస్తాడా అని బాగా ఆలోచించి, ఆ నలుగురు విద్యార్థులు ఈ అంశంపై న్యాయపోరాటానికి దిగారు. అలాగే వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో పాటు, రెస్టారెంట్ వాళ్ళకి బుద్ది చెప్పారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు దిగిరావాల్సి వచ్చింది. నలుగురు విద్యార్థులకు పరిహారంగా రూ. 12.5 లక్షల పరిహారం అందించారు. మోసాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న విద్యార్థులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read more :
Tom Holland about RRR Film : భారత పర్యటన, RRR అద్భుతం.. స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. వీడియో వైరల్
Sakshi Malik | ఇదేం ట్విస్ట్ .. రెజ్లర్ల నిరసన నుంచి సాక్షి మాలిక్ తప్పుకుందా ? నిజమెంత ?