HomecinemaPavitra-Naresh Love Story : త‌మ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన న‌రేష్‌..

Pavitra-Naresh Love Story : త‌మ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన న‌రేష్‌..

Telugu Flash News

Pavitra-Naresh Love Story : ప్ర‌స్తుతం ఏ టీవీ ఛానెల్‌లో చూసిన ఏ వైబ్ సైట్ లో చ‌దివినా కూడా న‌రేష్‌, ప‌విత్ర‌లోకేష్ కి సంబంధించిన వార్త‌లు గ‌త నాలుగేళ్లుగా సీక్రెట్ ఎఫైర్ న‌డిపిన వీరు ఇప్పుడు బ‌హిరంగంగా త‌మ రిలేష‌న్ షిప్ ప్ర‌క‌టించేశారు. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్టు కూడా తెలియ‌జేశారు. వీళ్ళిద్దరూ జంటగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల మందుకు రాబోతున్నారు. వాళ్ళ రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందని చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మే 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది.గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా అనేక విష‌యాల గురించి చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ గురించి మాట్లాడిన ప‌విత్ర‌.. న‌రేష్ ఎప్పుడూ నేటి గురించే ఆలోచిస్తారు. ఈ రోజు తమకి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని ఆయ‌న అనుకుంటూ ఉంటారు. రేపు అనేది వచ్చాక అప్పుడు చూసుకుందామంటారు. ఈ క్యాలిటీ ఆయనలో చాలా న‌చ్చింది. నేను నేర్చుకున్నాను కూడా.

అయితే అన్నిటికన్నా ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంత క‌న్నా నాకు కావాల్సింది ఏముంది. ఈ విషయంలో చాలా ఆనందంగా అని ప‌విత్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కొంద‌రు మాత్రం మా సిట్యుయేష‌న్‌ని బ్యాడ్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. తన వ్యక్తిత్వం త‌ప్పుగా చూపించి , కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారని.. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టమైందని ఆమె పేర్కొంది. తాను ఈ రోజు బయటికివచ్చానంటే కారణం అది నరేష్ వ‌ల్ల‌నే. ఆయనే తన వెనుక బలంగా నిలబడి వెన్నుతట్టారని ప‌విత్ర చాలా ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చింది.

ల‌వ్ స్టోరీ గురించి క్లారిటీ

అయితే అస‌లు వీరికి ల‌వ్ ఎప్పుడు పుట్టిందని అంద‌రిలో అనుమానం. తాజాగా క్లారిటీ ఇచ్చాడు న‌రేష్‌. `ఆలయం` సినిమా సమయంలో వీరిద్దరు ఓ సారి కలుసుకున్నారట. ఆ తర్వాత పదేళ్లకి `హ్యాపీ వెడ్డింగ్‌` సినిమా సమయంలో ఆమెని చూసి తెగ ఇష్ట‌ప‌డ్డాడ‌ట‌. ఇక `సమ్మోహనం` సినిమా షూటింగ్ స‌మ‌యంలో నీ స్మెల్‌ నచ్చింది అని ఆమెతో ఓపెన్‌గా చెప్పాను .

ఓ రోజు త‌న‌కి ఓ మెసేజ్ చేశాను, దానికి ఏ మాత్రం రియాక్ట్ కాలేదు. ఆరు నెలల గ్యాప్‌ తర్వాత బెంగుళూరులో కాఫీ షాప్‌లో కలుసుకున్నాం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉన్న నేప‌థ్యంలో క‌నెక్ట్ అయిపోయాం. మళ్లీ `సమ్మోహనం`లో అనుకోకుండా కవ‌గా అప్పుడు డిన్నర్‌కి తీసుకెళ్లి భోజనం చేశాక ఐ లవ్యూ చెప్పాడట.

అప్ప‌టి వ‌ర‌కు ఏం చెప్ప‌ని ప‌విత్ర‌.. హోటల్‌లో దిగి పోతున్న సమయంలో `కీప్‌ లవ్వింగ్‌ మీ` అనే మాట చెప్పి వెళ్లిపోయిందట. డిసెంబర్‌ 31 రోజు కేక్‌, బొకే తీసుకొని ఆమె వద్దకు వెళ్లాడట న‌రేష్ అప్పుడు ఐ లవ్యూ అని చెప్పిందని, అలా తమ లవ్‌ స్టోరీ సాగిందని న‌రేష్ త‌న ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ గురించి చెప్పాడు.

-Advertisement-

read more articles :

Teja:రాజ‌మౌళిపై తేజ విమ‌ర్శ‌లు.. ఆయ‌న సినిమాల‌న్నీ ఒకేలా ఉంటాయంటూ కామెంట్

Hansika: ఆ టాలీవుడ్ హీరో త‌న‌ని వేధించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హ‌న్సిక‌!

Faima-Praveen : ఫైమా ని కాకుండా ప్ర‌వీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News