HomecinemaRam Charan: చిరంజీవి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్ గురించి జీ 20 సద‌స్సులో రివీల్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: చిరంజీవి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్ గురించి జీ 20 సద‌స్సులో రివీల్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

Telugu Flash News

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ద‌క్కించుకున్న రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు క్రేజీయెస్ట్ హీరోగా మారాడు. అత‌నికి ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కుతుంది. తాజాగా అతనికి వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే జీ 20 సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో రామ్ చరణ్ పలు అంశాల మీద మేధావుల సభలో మాట్లాడారు. ప‌లు అంశాల గురించి చ‌ర్చించిన త‌ర్వాత త‌న తండ్రి చిరంజీవి అప్ క‌మింగ్ ప్రాజెక్ట్స్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. నాన్న నాలుగు సినిమాలకు సైన్‌ చేశార‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌.. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఆయ‌న‌ ఒకరని, ఇప్పటికీ తనకు స్ఫూర్తి అంటూ నాన్న గొప్పతనాన్ని ఘ‌నంగా చాటి చెప్పారు చరణ్.

ramcharan at G20 summitనాన్న ఏజ్ ప్ర‌స్తుతం 68 అని, ఇప్పటికీ 5.30 గంటలకు నిద్ర లేస్తారని, చాలా హార్డ్ వర్క్ చేస్తారని, క్రమశిక్షణ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు చరణ్‌. అయితే పనిలో ప‌నిగా చిరంజీవికి సంబంధించిన సినిమాల అప్‌డేట్‌ ఇవ్వడం హైలైట్ గా నిలుస్తుంది. ఇక త‌న తండ్రి నాలుగు సినిమాల‌కి ఓకే చేశారని కూడా అన్నారు. ఈ క్ర‌మంలో చిరుతో చేయ‌బోయే ఆ నలుగురు దర్శకులెవరనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. కళ్యాణ్‌ కృష్ణతో ఓ సినిమాకి చిరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. మలయాళ హిట్‌ మూవీ `బ్రో డాడి`కిది రీమేక్ గా తెర‌కెక్క‌నుంది.మ‌రోవైపు బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో పీరియాడికల్‌ ఫిల్మ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

చిరంజీవితో సినిమా చేయడానికి పూరీ జగన్నాథ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. వివి వినాయక్‌తో కూడా ఓ సిన‌మా చేయ‌బోతున్న‌ట్టు టాక్. అలాగే దర్శకుడు `వక్కంతం వంశీ`, డైమండ్‌ రత్నబాబు , ఓ తమిళ దర్శకుడు కూడా చిరంజీవిని కలిసి స్క్రిప్ట్ నెరేట్‌ చేశారని వీరిలో చిరు ఎవ‌రెవ‌రితో ప‌ని చేయ‌నున్నార‌ని రానున్న రోజుల‌లో తెలియనుంది. అయితే జీ20 స‌ద‌స్సులో ఇండియన్‌ సినిమా గురించి చెబుతూ, `ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక‌త‌ల‌తో మిళిత‌మైన మ‌న గొప్ప‌దనాన్ని సినీ రంగం త‌ర‌పున తెలియ‌జేసే అవ‌కాశం రావ‌టం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చ‌ర‌ణ్ చెప్పుకొచ్చారు. భారతదేశంలోని గొప్ప‌ సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారింద‌నే విష‌యాల‌ను కూడా రామ్ చ‌ర‌ణ్ చాలా చ‌క్క‌గా వివ‌రించారు.

also read :

Ram Charan: ఎన్టీఆర్‌గారు నాకు చికెన్ వ‌డ్డించారు.. ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

-Advertisement-

Ram Charan: క్రికెట్ టీమ్ కొన‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. పూర్తి క్లారిటీ ఇదే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News