Vastu tips in telugu : కొన్నిసార్లు కొన్ని వస్తువులు తెలిసీ తెలియక మన చేతుల్లోంచి కింద పడిపోతుంటాయి. ఇలా జరగడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. చిన్న పొరపాటు వల్ల పెద్ద సమస్యలు చుట్టుముడతాయని సూచిస్తున్నారు.
చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించాలని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం పనులు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏవో వస్తువులు చేజారి కిందపడుతుంటాయి. గాజు, పింగాణీ వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
వంటగదిలో వినియోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు జారి కిందపడతుంటాయి. ఆ మాత్రం ఒలకడం పెద్ద సమస్య కాదుకానీ ఉన్నపాటుగా అవి మీ చేతుల్లోంచి కిందకు పడిపోతే మాత్రం డేంజర్ సంకేతాలని చెబుతున్నారు.
చేతిలోంచి పాలు కిందపడకూడదట. ఇలా జరిగితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. అలాగే ఉప్పుని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా చెబుతారు. శనిబాధలు తొలగించుకునేందుకు దానం కూడా చేస్తారు. అయితే చేతిలోంచి ఉప్పు అకస్మాత్తుగా పడిపోతే రానున్న కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.
ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు కూడా చేతిలోంచి కింద పడకూడదట. వంటింట్లో ఉండే మిరియాలు, పూజా ఫలకం లాంటివి కూడా కింద పడటం వల్ల అశుభ సంకేతాలని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.
Read Also : Tirumala: మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ