HomecinemaNaresh: మా పెళ్లికి మ‌హేష్ బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. న‌రేష్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Naresh: మా పెళ్లికి మ‌హేష్ బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. న‌రేష్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Telugu Flash News

Naresh: గ‌త కొద్ది రోజులుగా న‌రేష్- ప‌విత్ర‌ల పేరు మీడియాలో తెగ మారు మ్రోగిపోతుంది. ఎక్క‌డ చూసిన‌, ఏ నోట విన్నా కూడా వీరిద్ద‌రి గురించే చ‌ర్చ. గ‌త నాలుగేళ్లుగా ప‌విత్ర‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న న‌రేష్ ఇప్పుడు ఏకంగా ఆమెని పెళ్లి చేసుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా చేయ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

రీసెంట్‌గా కన్నడ మీడియాతో మాట్లాడిన న‌రేష్‌.. మా ఇద్దరి మనస్సులు కలిశాయని అందుకే కలిసి ఉంటున్నామని అన్నాడు. వాస్తవానికి పెళ్లి అనేది కచ్చితంగా అవసరం కాదని , చాలామందికి పెళ్లి చేసుకోవడం ఇష్టం కూడా లేదని అయితే సొసైటీ కోసం పెళ్లి బంధంలో కలిసి ఉంటున్నార‌ని న‌రేష్ అన్నాడు.

అయితే నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. మా మనసులు కలిశాయి కాబ‌ట్టే ఇద్ద‌రం ఒకే చోట కలిసి ఉంటున్నాం.. త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ న‌రేష్ పెద్ద బాంబే పేల్చారు. అయితే న‌రేష్ చేస్తున్న ప‌నులు కృష్ణ ఫ్యామిలీ పరువు తీసేలా ఉంద‌ని , అస‌లు పెళ్లి చేసుకోకుండా నరేష్, పవిత్రలు ఒతి కలిసి జీవించడాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారనే విషయాన్ని తాజాగా న‌రేష్ తెలియ‌జేశారు.

మహేష్, కృష్ణ, అమ్మ విజయనిర్మల మాది అంతా ఒక కుటుంబం. ఒక మాట మీదే ఉంటాము. మా కుటుంబం అంద‌రు పవిత్ర లోకేష్ ని ఒప్పుకున్నారు కూడా న‌రేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు మా బంధం విషయంలో మహేష్ పాజిటివ్ గానే ఉన్నారని, ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని న‌రేష్ చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

పవిత్ర లోకేష్ వంటలను కృష్ణ చాలా ఇష్టంగా తినే వార‌ని కూడా చెప్పాడు. మా మొత్తం కుటుంబానికి పవిత్ర ఫుడ్ ప్రిపేర్ చేసే స‌త్తా ఉంది.. అందరూ పవిత్రను అంగీకరించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని కూడా న‌రేష్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

గత ఏడాది కృష్ణ మరణించిన నేపథ్యంలో పవిత్ర-నరేష్ అన్నీ తానై వ్యవహరించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇక నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కాలేదు కాబట్టి మరో వివాహం చేసుకోవడానికి అయితే వీలులేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్ట్ వెలువరించిన తీర్పు తనకు అనుకూలంగా ఉంద‌ని నరేష్ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే మ‌నోడు పెళ్లికి ఏ మాత్రం ఆల‌స్యం చేసేలా క‌నిపించ‌డం లేదు.

-Advertisement-

also read :

Ram Charan: ఎన్టీఆర్‌గారు నాకు చికెన్ వ‌డ్డించారు.. ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News