BRO: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మెగా మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ తమిళ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ చిత్రానకి బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
కొన్ని రోజుల క్రితమే ఈ టైటిల్ ఫిక్స్ చేసినప్పటికీ రీసెంట్గా గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. మోషన్ పోస్టర్ కోసం సంగీత సంచలనం తమన్ అందించిన నేపథ్య సంగీతం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి. అలానే పవన్ లుక్ కూడా కేక పెట్టించే విధంగా ఉంది. దీనిపై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.
అయితే బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా బ్రో అనేది ఒక ఇంగ్లీష్ పదం అని అందరికి తెలుసు. సాదారణంగా తమ్ముడు ని కానీ, అన్నయ్యని కానీ పిలవడానికి ఈమధ్య కాలం లో బ్రో అని చాలా కామన్ గా ఉపయోగిస్తుంటారు. ‘బ్రో’ అంటే ‘తమ్ముడు’ అని కూడా అర్ధం కూడా వస్తుంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం లో తమ్ముడు అనే చిత్రం చేయగా, ఈ చిత్రం ఎంతో పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాకి ‘బ్రో’ అనే టైటిల్ ని పెట్టడానికి ఒక కారణం ఉందట. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. ‘బ్రో’ అనే అక్షరం తో శివ శ్లోకం మొదలు అవుతుంది. ‘బ్రోవగ ధర్మ శేషం..బ్రోచిన కర్మహాసం..బ్రోతర చిద్విలాసం’ అంటూ శివ శ్లోకం తో మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనం గమనించవచ్చు.
ఆంగ్ల పదాన్ని సంస్కృతం తో జోడించాలనే ఆలోచన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలా వచ్చిందో కానీ, ఇది నిజంగా అద్భుతం అని కొందరు అతనిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఒకరినొకరు బ్రో అని పిలుచుకుంటూనే ఉంటారట. అందువల్లనే ఈ సినిమాకి బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుంది.
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, జూలై 28న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ‘రొమాంటిక్’ కథానాయిక కేతికా శర్మ కథానాయికగా నటిస్తుంది .ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర లో కనిపించనుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE