HomelifestyleCool Water: అతిగా కూల్‌ వాటర్‌ తాగుతున్నారా? గుండెపోటు రావొచ్చట!

Cool Water: అతిగా కూల్‌ వాటర్‌ తాగుతున్నారా? గుండెపోటు రావొచ్చట!

Telugu Flash News

Cool Water: వేసవి కాలం నేపథ్యంలో భానుడి భగభగలు భరించలేక చాలా మంది కూల్‌ డ్రింక్స్‌, చల్లటి నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఎండన పడి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో నుంచి చల్లటి వాటర్‌ను చాలా మంది తాగుతుంటారు.

ఇలా చేయడం వల్ల ధమనుల్లో ఆకస్మిక వాసోస్పాస్మ్ ఏర్పడడానికి కారణం అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధమనులు కుచించుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి చల్లని నీరు గుండెపోటుకు ట్రిగ్గర్‌గా భావించాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీరును తాగడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నప్పుడు శరీర టెంపరేచర్‌ను తగ్గించడానికి చల్లని నీరు తాగుతారు. గుండె సమస్య ఉన్న వారిలో ఇలా కూల్‌ వాటర్‌ తాగడం ప్రాణాంతకమైన కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుందట.

చల్లని నీరు తాగిన వెంటనే శరీరం తీవ్రమైన ప్రతిస్పందనను చూపిస్తుందని, ఆ ప్రతిస్పందనలో గుండెపోటు వచ్చే ఆస్కారం లేకపోలేదని చెబుతున్నారు. కాబట్టి కూల్‌ వాటర్‌ కాకుండా నార్మల్‌ వాటర్‌ తాగేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Read Also : Tirumala: ఏడాదిలోపు చిన్నారితో తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోండి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News