HomeweatherWeather Today (15-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఠారెత్తించే ఎండలు..

Weather Today (15-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఠారెత్తించే ఎండలు..

Telugu Flash News

Weather Today: మోచా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేడు, రేపు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ సుర్రుమనిపిస్తోంది.

బయటకు రావాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం కారణంగా ఇప్పటి వరకు వేసవి సెగ తెలియకుండానే మే వచ్చేసింది. ఈనెల తొలి వారంలోనూ ఎండ ప్రభావం కనిపించలేదు. కానీ గత నాలుగైదు రోజుల నుంచి మాత్రం సెగలు పుట్టిస్తోంది.

తెలంగాణ, ఏపీలో సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైగానే నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజులపాటు మరింత వేడి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలోని 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత మంచిర్యాల జిల్లా కొండపూర్‌లో 45.9 డిగ్రీలుగా నమోదైంది.

Read Also : horoscope today telugu : 15-05-2023 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News