HomenationalNetflix: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్‌కు కేంద్రం సన్నద్ధం!

Netflix: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్‌కు కేంద్రం సన్నద్ధం!

Telugu Flash News

Netflix: ఇండియాలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై పన్ను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మనదేశంలో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ ద్వారా వచ్చే ఆదాయంపై ట్యాక్స్‌ విధించేందుకు కసరత్తు జరుగుతోందట.

ఓ నివేదిక ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇది ఆచరణలోకి వస్తే.. విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం మొదటి సారి కానుంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ సర్వీసెస్ అందించే కంపెనీల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఫస్ట్‌ టైమ్‌ ఈ ట్యాక్స్‌ను ఎదుర్కొనే చాన్స్‌ ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన కారణంగా ట్యాక్స్‌ పరిధిలోకి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హెడ్‌క్వార్టర్స్ ఉన్నప్పటికీ.. ఇండియాలోనూ పెద్ద ఎత్తున సర్వీసెస్ అందిస్తోంది నెట్‌ ఫ్లిక్స్‌.

ప్రపంచంలోనే ప్రసిద్ధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌.. ఇండియాలోనూ బాగానే ఆర్జిస్తోందన్న విషయం ఐటీ శాఖ దృష్టికి వెళ్లింది. ఓ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లు సంపాదించిందని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేఫథ్యంలోనే పన్ను విధించేందుకు రెడీ అవుతున్నారట.

Read Also : Zelensky: తదుపరి యుద్ధం.. కాస్త సమయం కావాలన్న జెలెన్‌స్కీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News