Horoscope Today, 13th may 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలలో కాస్త శుభవార్తలు వింటారు. తొందర పాటు నిర్ణయాలు ఏ మాత్రం తీసుకోవద్దు. కుటుంబ సభ్యు లను కలుపుకొని ముందుకు సాగడం ఉత్తమం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ఉంటాయి.
వృషభం
ఈ రాశి వారు అనవసర ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఒకటి రెండు శుభవార్తలు మీ చెవిన పడతాయి.. గతంలో కుటుంబ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.. శరీరానికి కొద్దిపాటి విశ్రాంతి అవసరం
మిథునం
ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది.. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది.. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా పురోగతి చెందుతుంది. విలాసాల మీద, దానధర్మాల మీద ఖర్చు చేయడం కొద్దిగా తగ్గించుకుంటే ఉత్తమం. పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. బాగా తెలిసిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమలో భాగంగా భారీగా కానుకలు కొని ఇస్తారు.
సింహం
ఈ రాశి వారికి కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆర్థిక పరిస్థితి సానుకూల పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ఆఫర్ అందవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభించే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా డబ్బు మోసపోయే అవకాశం ఎక్కువ. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తుల
ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆదాయం లేదా సంపా దనకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి తలెత్తుతుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన తీపి కబురు అందుతుంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే ఛాన్స్ ఉంది.
వృశ్చికం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా రోజంతా సాఫీగా గడిచిపోతుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అవి అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.
ధనుస్సు
ఈ రాశి వారికి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు వెళ్లకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతూ ఆర్థిక భారాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
మకరం
ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా సాగిపోతుంది. వ్యాపారంలో క్రమంగా లాభాలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి రంగానికి చెందినవారు బాగా బిజీ అవుతారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు కూడా లాభాల బాటలో పయనిస్తారు.
కుంభం
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి మిత్రుల సహాయంతో బయట పడటం వలన సంతోషంగా ఉంటారు.
మీనం
ఈ రాశి వారికి ఉద్యోగ పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉంది.
also read :
Netflix: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్‌కు కేంద్రం సన్నద్ధం!
Zelensky: తదుపరి యుద్ధం.. కాస్త సమయం కావాలన్న జెలెన్స్కీ
Trump: మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్.. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో తిట్ల దండకం!
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
Ram: హీరో రామ్ ఆ రోజు అభిమానులకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడా?