Homehealthdehydration : డీహైడ్రేషన్‌తో చాలా డేంజర్‌.. ఎంత నష్టమంటే..!

dehydration : డీహైడ్రేషన్‌తో చాలా డేంజర్‌.. ఎంత నష్టమంటే..!

Telugu Flash News

dehydration : వేసవి కాలంలో శరీరంలోని నీరు చెమట రూపంలో చాలా వరకు బయటికి వెళ్లి పోతుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. సమయానికి నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

దీనివల్ల మూర్చలు, మూత్రపిండాల వైఫల్యం, కోమా వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడితే మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను తేలిగ్గా తీసుకోరాదు.

వేసవిలో దాహం వేసినా, వేయకపోయినా ప్రతిగంటకు గుక్కెడు నీళ్లు తాగుతుండాలి. డీహైడ్రేషన్ వల్ల పెద్ద పేగుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పెద్ద పేగు అనేది జీర్ణవ్యవస్థలోని చివరి విభాగం. పేగులు ప్రతిరోజు ఒక లీటరు కంటే ఎక్కువ ద్రవాన్ని గ్రహిస్తాయి. పేగులోని వ్యర్థాలను ఆ ద్రవం సాయంతో బయటికి పంపేందుకు ప్రయత్నిస్తాయి. ఆ వ్యర్థాలే మలం. పెద్దపేగుకు తగినంత నీరు అందకపోతే మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య అటాక్‌ చేస్తుంది.

డీహైడ్రేషన్ వల్ల పేగులలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటి కొరత కారణంగా పేగుల పనితీరు నెమ్మదిగా మారడమే కాదు కొన్నిసార్లు ఆగిపోతుంది. అందుకే వేసవి కాలంలో నీటిని తాగుతూ ఉండాలి.

Bone health : ఎముకల పటుత్వం కోసం తినాల్సిన ఆహారాలు ఇవే.. 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News