Salman Khan: సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సల్మాన్ ఖాన్. ఎంతో మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం నడిపిన సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్లి చేసుకోలేదు.
ఇక జీవితంలో పెళ్లి కూడా చేసుకునేలా లేడు. అయితే ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి, పిల్లల గురించి స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లు పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడని సల్మాన్ తాజాగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.
మా ఇంటికి కోడల్ని తీసుకురావాలనే ఆలోచన అయితే ఇప్పుడు నాకు ఏమాత్రం లేదు అని అన్నాడు. అయితే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాను కాబట్టి ఓ పాపను తీసుకొచ్చి పెంచుకోవాలని ఉంది.
ఇది సాధ్యపడేలా భారతీయ చట్టాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి అని తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు సల్మాన్. ఏదేమైనా సల్మాన్ ఖాన్ ఇన్నాళ్లకు తన మనసులోని మాటను బయటపెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
also read :
Salman Khan: అందరి ముందే హీరోయిన్‌కి సల్మాన్ ముద్దులు.. అనంతరం మూతి తుడుచుకున్న కండల వీరుడు
Pooja Hegde: సల్మాన్ ఖాన్ తో డేటింగ్‌పై స్పందించిన పూజా హెగ్డే