Weather Today : తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సూర్యాపేటలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో నేడు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30, 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో నేడు, రేపు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవాళ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
పిడుగులు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని, చెట్ల కింద ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు.
also read :
Vanitha Vijay Kumar: విషాదం.. వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
Horoscope (01-05-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?