Qualcomm : ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజ కంపెనీలన్నీ కొన్నాళ్లుగా లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం చిప్ తయారీలో అంతర్జాతీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్వాల్‌కమ్ కంపెనీకి కూడా ఈ కష్టాలు తప్పడం లేదు.
రెవెన్యూ గ్రోత్ లేక ఆ సంస్థ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ ఉద్యోగులనూ తొలగించేందుకు రెడీ అవుతోంది.
వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని ఆ మేరకు కాస్ట్ కటింగ్ చేసుకోవాలని క్వాల్‌కమ్ సంస్థ భావిస్తోంది. కేవలం కాలిఫోర్నియా క్యాంపస్‌లోనే దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యింది క్వాల్‌కమ్.
మే 3వ తేదీన ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు క్వార్టర్లీ రిజల్ట్స్‌నీ వెలువరించనుంది కంపెనీ. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో కనీసం 5% మేర కోత విధించేందుకు ఆ కంపెనీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే…మొబైల్ డివిజన్‌లోనే భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనే 20% మేర కోతలు తప్పేలా లేవని సమాచారం. కొద్ది నెలలుగా క్వాల్‌కమ్ కంపెనీ సేల్స్, రెవెన్యూ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బందిని తగ్గించుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE