History of Thailand :14వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తుల చేత స్థాపించబడిన అయుత్తయ నగరం రామిడి 1 దీన్ని తన రాజధానిగా చేసు కొన్న తర్వాత దైవదూతలు, రాజుల పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. నేటికి కూడా మధ్య యుగాల నాటి అయుత్తయ నగరం యొక్క సౌందర్యం రాజు రామ్ థిబోడి గురించి మనసులో స్థిర భావాన్ని జ్ఞప్తికి తెస్తుంది. దాదాపు 260 అడుగుల ఎత్తైన గోపురాలతో, అద్భుతమైన దేవాలయ సముదాయాలతో, భారీ బుద్ధ విగ్రహాలతో అలరారిన ఈ నగరం నుంచి దాదాపు 35 మంది రాజులు 400 సంవత్సరాల పాటు సయామ్ ప్రాంతాన్ని పరిపాలించారు.
కాలక్రమంలో ఆగ్నేయ ఆసియాలోనే 10 లక్షల మంది ప్రజలతో అతి పెద్దనగరంగా, సంపన్న నగరంగా రూపు దిద్దుకొంది. 18వ శతాబ్దంలో బర్మా సైన్యాలు దీని పై దాడిచేసిన తర్వాత దీని ప్రాభవం క్షీణించడం మొదలయింది. ప్రస్తుతం ఒక చిన్న ప్రాంతానికి రాజధానిగా మారిపోయింది. 65,000 మంది మాత్రం ఇప్పటికీ ఈప్రాంతంలోనివసిస్తున్నారు.
చాలాకాలం క్రితం ఖ్మేర్ రాజులు ఇప్పటి థాయ్లాంటి రాజధాని బాంగా కాకికి 45 మైళ్ళ దూరంలో మైనామ్ చూప్రయా ద్వీపం మీద రాసిక్, లాబ్ ప్యూర్ నదుల మధ్యలో వున్న ఒక రామబోడి 1 తన రాజధానిని సుకోధాయ్ నుంచి ఈ చిన్న ఒక చిన్న నగరాన్ని ఏర్పాటు చేశారు. 1351వ సంవత్సరంలో నగరం అయుత్తయకు మార్చాడు. సారవంతమైన నరీ మైదానాలు, అధిక పంట దిగుబడులు, చురుగ్గా పనిచేస్తు పన్నుల వసులు విధానములు, అయుత్తయ అభివృద్ధికి ఉన్నత స్థితికి చేరుకోవటానికి దోహదం చేశాయి. చైనా, జావా, మలేషియా, ఇండియా, సిలోన్, జపాన్, పర్షియాలతో వర్తక వాణిజ్యం ఎంతో వృద్ధి చెందింది. అలాగే పోర్చుగల్, ఫ్రాన్స్, హాలండ్ ఇంగ్లాండ్ దేశాలకు దూరప్రాచ్యం ప్రాంతంలో వున్న తమ స్థావరాలు ద్వారా వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకున్నది. అత్యుత్తమ వస్తువులతో దేవాలయాలు, ప్రాసాదాలు, పెద్ద పెద్ద బుద్ధుడి విగ్రహాలు. వంటివి ఎన్నింటినో నిర్మించి అందంగా తీర్చిదిద్దారు. అన్ని దేవాలయాల గోపురాలను బంగారు (బంగారపు)రేకుతో తాపడం చేశారు.
17వ శతాబ్ది చివర్లో అయుత్తయ రాజులు బర్మాతో సైనిక ఘర్షణలకు దిగడంతో అయుత్తయకు కష్టకాలం మొదలయింది. 16వ శతాబ్ది చివర్లో నగరం చుట్టూ నిర్మించిన విశాలమైన, దృఢమైన గోడ బర్మా సైన్యాలు చేసిన అనేక దాడులు, ఆక్రమణల నుంచి చాలాకాలం పాటు రక్షణ కల్పించింది. ఏప్రిల్ 7, 1767లో బర్మా సైన్యాలు విజయం సాధించి, నగరం మొత్తాన్ని ‘ఆక్రమించుకొని దేవాలయల్లో వున్న అంతులేని సంపదను దోచుకొని, నగరంలో చాలా భాగం ధ్వంసం చేశాయి. ఆ విధ్వంస కాండ చూసి బుద్ధుడి విగ్రహాల కళ్ళ నుంచి కన్నీళ్ళు కారాయనిచెప్తారు.
ఈ పరాజయం తర్వాత అధికారంలోకి వచ్చిన రామ | అనే రాజు తన రాజధానిని కొత్తగా నిర్మించిన బ్యాంగ్కాక్ నగరానికి మార్చటంతో అయుత్తయ పట్టణం ఇంకా శిథిలమై పోవటం మొదలు అయింది. ప్రస్తుతం అయుత్తయలో ఆనాటి వైభవం లీలా మాత్రంగా కనిపిస్తుంది. ఎత్తైన, మనసుదోచే ఘంటాకార గోపురాలు, దేవాలయాలు, మఠాలు, శిధిలాలు ఆనాటి వైభవాన్ని ఈ నిర్మాణంలో ఆకాలం భద్రం చేసిన భిక్షువుల అవశేషాలు ఆనాటి రాజులు వారి కుటుంబాలలోని మిగిలిన సభ్యుల భౌతిక అవశేషాలను జ్ఞప్తికి తెస్తాయి. మహాభాట్ దేవాలయం గోపురంలో బుద్దుడి చివరి భౌతిక అవశేషాలను పదిలం చేశారని విశ్వసిస్తారు.
అయుత్తయాకు స్వర్ణయుగంగా చెప్పబడే కాలంలో ఈ నగరం 3 రాజ ప్రసాదములు, 375 దేవాలయాలు, 94 నగర ద్వారాలు, 29 తోటలతో విలసిల్లింది. అన్ని దేవాలయాల్లోకి 15వ శతాబ్దంలో నిర్మించిన వాతృరాశి శాన్షీట్ దేవాలయం ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉన్న మూడు గోపురాలతో ఎంతో అందంగా ఉండేది. అయుత్తయను పరిపాలించిన మొదటి ఇద్దరు రాజులు. రామ్ బోడి I, రామ్ బోడి II ల బూడిదను ఈ దేవాలయంలోనే భద్రంచేయటం జరిగింది.
ఒకప్పుడు అయుత్తయ నిర్మాణపరంగా, సాంస్కృతికంగా అధిరోహించిన ఉన్నత శిఖరాలను ఈ శిధిలాలు గుర్తుచేస్తూ ఉంటాయి. ఖ్మేర్ రాజుల సౌందర్య ఉపాసక ప్రభావం, ఇండియా, సిలోన్లో వ్యాపించింది. ఇక్కడ రూపము, శైలీవిశిష్టతలు గొప్ప ఆరాధ్యతతో సంగమించటం జరిగింది. ప్రపంచం మళ్ళీ ఎప్పుడు ఇటువంటి అపురూపమైన నగరాన్ని చూడలేదు. చూడబోదు అని చెప్పవచ్చు.
also read :
Aishwarya Rai: మణిరత్నం పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. గ్రేట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్
Pattu cheera – our tradition : పట్టుచీర- మన సాంప్రదాయం గురించి తెలుసుకోండి
Gold Rates Today ((26-04-2023) : ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..