Hometelanganaడిగ్రీ చదువుతూ నెలకు రూ.10 వేలు సంపాదించేలా ప్రభుత్వం కార్యాచరణ!

డిగ్రీ చదువుతూ నెలకు రూ.10 వేలు సంపాదించేలా ప్రభుత్వం కార్యాచరణ!

Telugu Flash News

డిగ్రీ చదువుకుంటూనే విద్యార్థులు నెలకు రూ.10 వేలు ఆర్జించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోంది. రాబోయే విద్యాసంవత్సరం నుంచి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.

తెలంగాణలో 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. అత్యధిక అడ్మిషన్లున్న 103 కాలేజీల్లో స్కిల్ కోర్సులను తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 37, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు 66 ఉన్నాయి. ఓయూ పరిధిలోనే 56 కాలేజీలుండటం గమనార్హం.

సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (Sector Skill Councils) సాయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను నిర్వహించనున్నారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం సహా నిర్వహణ తదితర అంశాలపై సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సమావేశం నిర్వహించారు.

ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా వర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ప్రతినిధి సుబ్బారావుతో రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు.

ఈ నెల 28న మరోమారు సమావేశమై, పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని నిర్ణయించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఈ దిశగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫలితంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు రాబోతున్నాయి.

also read :

-Advertisement-

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది అమ్మాయేన‌ట‌.. విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవాల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టింది.. వైర‌ల్‌గా మారిన వార్త‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News