moral stories in telugu : ఒక ఊళ్ళో చల్లని సాయం సమయాన ముగ్గురు బాలురు బంతి ఆడుకుంటున్నారు. వారిని చూసి ముచ్చట వేసి ఆ దారిన వెడుతున్న హృషీకేశ స్వాములవారు ముగ్గుర్ని దగ్గరకు పిలిచి తన మహిమతో మూడు గిన్నెలలో పాయసం తెప్పించి బంగారు గిన్నెలో పాయసం ‘రాఘవదాసు’కి ఇచ్చి “ఈ దేశానికి రాజువవుతావు తాగు రాఘవా!” అన్నాడు.
వెండి గిన్నెలో పాయసం తిరుమలదాసు కిచ్చి “నువ్వు అదే రాజ్యానికి మంత్రివవుతావు తాగు తిరుమలా!” అని మూడవదైన కంచు గిన్నెలో పాయసం చరణదాసుకిచ్చి “నువ్వు అదే రాజ్యానికి సేనాధిపతివవుతావు తాగు చరణా!” మీ స్నేహం నిలిచేట్టు విధి ఒక చోటికే చేరుస్తుంది” అని వెళ్ళిపోయాడు. వారి విద్యాభ్యాసం పూర్తి అయింది.
ముగ్గురూ తిరిగి వస్తూ ఒక చెట్టు నీడన పడుకున్నారు. ఇంతలో ఏనుగు ఊరేగింపుతో నృత్యగీతాలు వీనుల విందుగా వినపడి రాఘవుడు ఏత్తుగా ఉన్న గట్టెక్కి కూర్చున్నాడు. స్నేహితులిద్దరూ వినోదం చూస్తుండగానే ఏనుగు తన తొండానికి ఉన్న పూలమాల విసిరేసింది. అది ఎగురుతూ వచ్చి రాఘవుడి మెడలో పడింది. ‘చక్కెర పందాల్లో తేనెవాన కురిసినట్లయింది. రాఘవుడు రాజయ్యాడు.
రాజు తిరుమలని మంత్రిగాను, చరణుని సేనాధిపతి గాను నియమించాడు. తక్షణం చరణుడికి స్వాముల వారి మీద కోపం వచ్చింది. బంగారు గిన్నెలో పాయసం తనకిస్తే తనే రాజయ్యేవాడు కదా అని లోపల్లోపల మండిపడ్డాడు. సైన్యం అంతా తన చేతిలో ఉంది. స్వామిని వెతికించి పట్టితెచ్చి రోజూ పది కొరడా దెబ్బలు కొట్టించేవాడు. “చేసుకున్న వారికి చేసుకున్నంత.
బ్రహ్మరాసిన రాత చెరపనెవరి తరము” అని ఎంత చెప్పినా ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టయ్యింది’. కాచిన చెట్టుకు రాళ్ళ దెబ్బలు! నేర్చిన స్వామికి కొరడా దెబ్బలు’ తప్పలేదు.
తిరుమల యోచన గల మంత్రి కనుక అతి రహస్యం బట్టబయలు అయ్యింది. స్వామి వారి పని ‘ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్న’ సంగతి రాజుకి చెప్పాడు. రాజు, మంత్రి స్నేహితుడి అధర్మ బుద్ధికి అత్యాశకి బాధపడ్డాడు. చరణదాసు మీద న్యాయవిచారణ జరిగింది చరణా! మన యోగ్యతలకు స్వామి ఏం చేస్తాడు, పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలాగా’ అతడికి నిత్యం పది కొరడా దెబ్బలా? పేనుకి పెత్తనం ఇస్తే తలంతా చెడకొరికిందట’ నీకు రోజుకి ఇరవైకొరడా దెబ్బలు తప్పవు. చెరసాల వాసం తప్పదు.” అన్నాడు రాజు.
నీతి : బ్రహ్మ రాసిన రాత ఎవరూ చెరపలేరు. చేసుకున్న వారికి చేసుకున్నంత.
also read :
balagam mogilaiah : విషమంగా బలగం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి.. హైద్రాబాద్ ఆసుపత్రిలో చేరిక
capsicum tomato curry : క్యాప్సికమ్ టమోటా కర్రీ .. ఈ కూర తిన్నారంటే.. ఆహా అనాల్సిందే..
Horoscope (12-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Khajuraho Temples : శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో గురించి తెలుసుకోండి