Sunday, May 19, 2024
Homeviral newsViral Video : పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలు.. లేపి మరీ తన్నించుకున్న యువకుడు

Viral Video : పడుకున్న ఆవులతో పిచ్చి చేష్టలు.. లేపి మరీ తన్నించుకున్న యువకుడు

Telugu Flash News

Viral Video : జంతువులతో ప్రేమగా వ్యవహరిస్తే అవి కూడా మనల్ని ఏమీ చేయవని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు, పెద్దలు చెబుతుంటారు. అయితే, కొందరు చిలిపి చేష్టలు, పిచ్చి ఆటలతో జంతువులను ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని జంతువులు సాఫ్ట్‌గా వెళ్లిపోతే మరికొన్ని తిరగబడతాయి.

ఇలాంటి సందర్భాల్లోనే చిలిపి ఆటలు ఆడేవారికి తగిన శాస్తి జరుగుతుంటుంది. తాజాగా వైరల్‌గా మారిన ఓ వీడియోలో యువకుడు చేసిన పనికి మూగ జీవం ఎలా రియాక్ట్‌ అయ్యిందో మీరే చూడండి. ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో యువకులు హాయిగా పడుకొని సేద తీరుతున్న ఆవులతో పిచ్చి ఆటలు ఆడారు.

Tower of Pisa : లీనింగ్ టవర్ ఆఫ్ పీసా గురించి తెలుసుకోండి..

తర్వాత దిమ్మతిరిగిపోయే ఫలితం చవిచూడాల్సి వచ్చింది. ఇది వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు యువకులు ఓ ఫుట్‌ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఆ బ్రిడ్జిపై కొన్ని ఆవులు హాయిగా పడుకొని సేద తీరుతున్నాయి. మేసిన గడ్డిని నెమరేసుకుంటూ రిలాక్స్‌ అవుతున్నాయి. ఇంతలో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు.

ప్రఖ్యాత షోలే సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ అయిన ఏ దోస్తీ హమ్‌ నహీ తోడెంగే.. అనే పాటను హమ్‌ చేస్తూ అల్లరి చేష్టలు చేయసాగారు. ఇలా మొదట ఓ ఆవు వద్ద చేతులతో బెదిరించినట్లు యాక్ట్‌ చేశారు. అది ఏమీ అనలేదు. అయితే, తర్వాత పడుకున్న ఆవు దూడ మాత్రం వీరికి ఝలక్‌ ఇచ్చింది. పాట పాడుతూ బెదిరించేందుకు ఆవు దూడ మెడను పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు.

Donald Trump : అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.. అణుయుద్ధం రావొచ్చన్న ట్రంప్‌

-Advertisement-

అత్యుత్సాహంతో ఆవు దూడను కౌగిలించుకొనేందుకు ట్రై చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆవుదూడ ఆ యువకుడికి గట్టి పంచ్‌ ఇచ్చింది. కాళ్లతో ఈడ్చి జాడించింది. దీంతో సదరు యువకుడు ఎగిరి అవతల పడ్డాడు. ఈ దృశ్యాన్ని వెనకవైపు వస్తున్న యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియోను కర్మ వీడియోస్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 5.74 లక్షల మందికి పైగా వీడియోను చూశారు. 19 వేల మందికిపైగా వీడియోను లైక్‌ చేశారు. వాడికి కావాల్సిందేలే.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూగ జీవాలతో ఆటలా.. బాగా జరిగిందంటూ మరికొందరు తమ కామెంట్లను పోస్టు చేస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News