Tower of Pisa : పైసా నగరపు వాలిన గోపురం (ఇటలీ)
రిసాకెథెడ్రలకు నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టిన ప్పుడు దాని పోషకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ సహనిర్మాణం
వాళ్ల అధికారానికి, వైభవానికి శాశ్వతమైన చిహ్నంగా నిలిచిపోవాలని, కాని ఈ వాలిన గోపురం ద్వారా అధికారానికి, నిర్మాణ శిల్పానికి మధ్య గల తేడాను స్పష్టంగా చూపించటం జరిగింది. క్రీ.శ. 1173వ సంవత్సరంలో టుస్కానీ ప్రాంతంలోని పైసా నగరంలో కేథడ్రల్కి గంటస్థంభం నిర్మించే బాధ్యత బొనానో రిశానో అనే నిర్మాణ శిల్పికి అప్పగించబడింది. దేశానో ఒక గుండ్రటి స్తంభం లాంటి నిటారుగా నిలబడి ఉండే సహ నిర్మాణానికి రూపకల్పన చేశాడు.
నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నప్పుడే రిశానో కట్టిన పునాదులు భూమిలో ఉన్న అస్థిరమైన అథస్తర మృత్తికలు తగినంత బలంగా లేవని అర్ధమయిపోయింది. 3వ అంతస్తు నిర్మాణం పూర్తయ్యేటప్పటికి ఈటవరు ఆగ్నేయ దిశలో 35 అంగుళాలు పక్కకి ఒరిగి పోయింది. తన పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో బొనానో రిశానో ఈటవరు నిర్మాణ ఆపివేశాడు. 100 సంవత్సరాలపాటు అలా ఆగి పోయిన ప్రమాదకరమైన ఈటవరు నిర్మాణ కార్యక్రమం క్రీ.శ. 17వ సంవత్సరంలో జియో వహ్న డిసిమోన్ అనే ప్రఖ్యాత నిర్మాణ శిల్పి ఆధ్వర్యంలో మళ్ళీ మొదలైంది. ఈటవరు పక్కకి ఒరిగిపోయిన దాన్ని పూరించి సరిచేద్దామనే ఉద్దేశ్యంతో జియో వన్ని మిగిలిన నాలుగు అంతస్తులను నిటారుగా (నిట్టనిలువుగా) నిర్మించాడు.
నాలుగు అంతస్తుల నిర్మాణం పూర్తయ్యేటప్పటికి ఈటవరు రూపులో ఒక అసహజమైన కోణం ఏర్పడి వింతగా కన్పించటం మొదలయింది. మొత్తం 7 అంతస్తుల బరువు పడేట ప్పటికి పునాదులు మెత్తటి నేలలోకి కుంగిపోయి, గోపుర స్తంభం ఇంకొద్దిగా ప్రక్కకి ఒరిగిపోయింది. క్రీ.శ.1298వ సంవత్సరం నాటికి 4.69 అడుగులు ప్రక్కకి ఒరిగిపోయింది. క్రీ.శ. 1360 సంవత్సరం నాటికి ఈ టవరు 5.35 అడుగులు ప్రక్కకి ఒరిగిపో యింది. క్రీ.శ. 1372 సంవత్సరంలో టోమ్మసో పిశానో ఈ గోపుర స్తంభాన్ని పూర్తిచేద్దామని, ప్రక్కకి ఒరిగిపోయిన గోపుర స్తంభం మీద గంట ఉండే గదిని నిటారుగా నిర్మించాడు. అలా గోపుర స్తంభం నిర్మాణం మొదలైన 200 సంవత్సరాల తర్వాత పూర్తయింది.
గోపుర స్తంభాన్ని పరిరక్షించటానికి ఇటాలియన్ ప్రభుత్వం ఒక సమగ్రమైన పథకాన్ని చేపట్టింది. ఈ టవరు ఉత్తర భాగంలో 690 టన్నుల లెడ్ బార్సు (సీసపు తీగెలు) బిగించి వాటిని నేలలో 150 అడుగుల లోతున పాతిపెట్టారు. టవరు ఇంకా పక్కకి ఒరిగిపోకుండా ఇది ఆపగలిగింది. పునాదుల్లోకి కాంక్రీటుని పంపించి టవరుకి ఇంకొద్దిగా స్థిరత్వాన్ని చేకూరుద్దామని చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. క్రీ.శ. 1998వ సంవత్సరంలో ఈటవరు కూలిపోకుండా దీని ఉత్తరభాగం ఒక్కొక్కటి 4 టన్నుల బరువు 330 అడగుల పొడుగున్న రెండు ఉక్కు తీగెలతో కట్టివేయబడింది.
నిర్మాణశిల్పనిపుణులు కాని, కళా చరిత్రకారులు కాని ఈ గోపుర స్తంభం మీద పూర్తిగా ఆశలు వదులుకోలేదు. క్రీ.శ. 1999వ సంవత్సరం ఫిబ్రవరి నుంచి 2001వ సంవత్సరం జూన్ వరకు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి (గోపుర స్తంభానికి) ఈ టవరుకు స్థిరత్వం చేకూర్చటానికి ప్రయత్నాలు జరిగాయి. దీని ఉత్తరపు గోడకింద నేలలోకి దూర్చిన చొప్పించిన) శూన్య ప్రదేశ గొట్టం దాదాపు 30 టన్నుల మెత్తటి మట్టిని బయటికి తీయగలిగాయి. దీనివల్ల ఈటవరు 1.75 అడుగులు యథా స్థానం వైపుకి (దాని అసలు స్థానం వైపుకి ఒరిగింది. ఈ కొత్త పద్ధతి పనిచేస్తున్నట్లుగానే కన్పిస్తోంది, ఈటవరు నెమ్మదిగా నిటారుగా వస్తోంది. 250 సంవత్సరాల క్రితం ఇది ఎంత పక్కకి ఒరిగివుందో ఇప్పుడు మళ్ళీ అట్లానే వుంది.
ఈ టవరు పూర్తిగా నిటారుగా కాలేకపోయినా కూలిపోతుందేమో అనే భయాందోళనలు లేకుండా, దీని చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థిరంగా నిలిచింది. ఇంకో 200-300 సంవత్సరాల పాటు ఇది ఇట్లాగే స్థిరంగా నిలిచివుంటుందని నిర్మాణ శిల్పులకు నమ్మకం కుదిరింది. అందువల్ల క్రీ.శ. 2001వ సంవత్సరం నుంచి పైసా వాలిన గోపురంలోకి సందర్శకులను, ప్రజలను అనుమతించటం జరుగుతోంది. 180 అడుగుల ఎత్తైన ఈ టవరు మీదకు ఇప్పుడు క్షేమంగా ఎక్కి రావచ్చు. ఇటలీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ గంట గోపుర స్తంభంలోని 7 గంటలు చాలా సంవత్సరాల తర్వాత మోగటానికి అనుమతి ఇవ్వబడింది (అవకాశం లభించింది).
also read :
Donald Trump : అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.. అణుయుద్ధం రావొచ్చన్న ట్రంప్
Harshavardhan : హృదయాన్ని కదిలించే కథ.. మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న యువకుడు..
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ లుక్ పోస్టర్.. భయపడుతున్న ఫ్యాన్స్