Upasana:మెగా ఫ్యామిలీ కోడలు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఆమె ముంబైలో ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకి సంబంధించి చాలా కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి అయిన కొత్తల్లో నేను లావుగా ఉన్నానని, అందంగా లేనని, డబ్బులు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడంటూ చాలా విమర్శలు చేశారు.
విమర్శలు చేసిన వారిని నేను ఏమి అనను, అందుకు కారణం వారికి మా గురించి ఏమి తెలియదు. పదేళ్ల కాలంలో క్రమంగా వారికి నేనేంటో తెలిసింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొని నేను ఛాంపియన్‌లా అనుకుంటాను. విమర్శలని ఎదుర్కోవడం వలన ధైర్యవంతురాలిగా మారాను అంటూ ఉపాసన ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా రామ్ చరణ్‌కి నాకు పరిచయం ఏర్పడగా, చరణ్ ఎప్పుడూ నాకు ఛాలెంజ్ విసిరేవాడు. నేను కూడా అంతే తనకు ఛాలెంజ్‌లను విసిరేదాన్ని. అలా ఎదుగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది అని చెప్పుకొచ్చింది ఉప్సీ.
also read:
MLC Kavitha On Modi : డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే అత్యంత పెద్ద ఉద్యోగమా? కవిత విమర్శలు!
Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!