Horoscope Today, 23rd March 2023: Check astrological prediction for your zodiac signs
మేషం
ఈ రాశి వారు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు ఎంతగానో లభిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పనులన్నీ సంతృప్తికరంగానే ఉంటాయి.
వృషభం
ఈ రాశి వారు లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రుల ఒత్తిడికి లొంగకుండా ఉండండి. ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సహచరులు మీ బాధ్యతలను పంచుకోవడంతో సంతోషంగా ఉంటారు.
మిథునం
ఈ రాశి వారు విహార యాత్రలలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా ఎదుగుదల కనిపించదు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించే అవకాశం ఉంది.. విద్యార్థులు విజయాలు సాధించే అవకాశం ఎక్కువ.
కర్కాటకం
ఈ రాశి వారు ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఇరుగుపొరుగు వారితో కొద్దిగా చికాకులు కనిపిస్తాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు, కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోవడం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారం సాఫీగా సాగిపోతుంది.
సింహం
ఈ రాశి వారు విలాసాల కారణంగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్లో పడతాయి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తప్పనిసరిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
also read : Viral Video : మర్రిచెట్టు వంతెన చూశారా? నది దాటాలంటే సాహసమే!
కన్య
ఈ రాశి వారి వ్యాపారం సజావుగానే సాగిపోతాయి. కుటుంబ పరిస్థితి అన్ని విధాలా ప్రశాంతంగానే ఉంటుంది. బంధువుల్లో కొందరు మీ మీద చెడు ప్రచారం సాగించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు శరీరంలో కొద్దిపాటి నలత వల్ల ఆగిపోయే ఛాన్స్ ఉంది.
తుల
ఈ రాశి వారు ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ.. స్నేహితుల సహా యంతో కొన్ని వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు.
వృశ్చికం
ఈ రాశి వారికి సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన పనుల్లో కొంత టెన్షన్లు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేసే అవకాశం కూడా ఉంది.
also read : Rajamouli: ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు అంటూ సీనియర్ నటి కామెంట్
ధనుస్సు
ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు.
మకరం
ఈ రాశి వారు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వాగ్దానాలు చేయటం అసలు మంచిది కాదు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
కుంభం
ఈ రాశి వారు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే సాగిపోతుంది. కుటుంబ పరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి.. ముఖ్యమైన నిర్ణయా లలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం ఉత్తమం. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం
ఈ రాశి వారు ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు కొత్త ఆఫర్లు అందే ఛాన్స్ ఉంది.. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడే అవకాశం ఎక్కువ.