Viral Video : సాధారణంగా కరుడుగట్టిన నేరస్తులు దేనికీ భయపడరు. నేరాలు చేయడంలో ఎక్స్పర్టులుగా మారిన కొందరు.. పోలీసులను, న్యాయ వ్యవస్థను కూడా లెక్కచేయరు. ఈ క్రమంలో దురుసుగా వ్యవహరిస్తుంటారు. అయితే, సింగం లాంటి పోలీసు అధికారులు నేరస్తుల పాలిట సింహ స్వప్నాలుగా మారుతుంటారని మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా ఇలాంటి పోలీసు అధికారులు నేరగాళ్ల అంతు చూస్తున్నారు. చట్టాన్ని గౌరవించని దుండగులపై లాఠీ ఝులిపిస్తుండడంతో కొందరికి భయం పట్టుకుంటోంది.
ఈ క్రమంలో కొందరు నేరస్తులు పోలీసులంటేనే హడలెత్తిపోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులంటేనే నేరగాళ్లు పోసేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసులు కరుడుగట్టిన నేరస్తులను ఎన్కౌంటర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఖైదీలుగా ఉంటున్న వారిలో దడ పట్టుకుంది. ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఓ ఖైదీ ఎన్కౌంటర్పై విపరీతంగా భయపడిపోయాడు.
పోలీసులు తనను ఎక్కడ ఎన్కౌంటర్ చేసిపారేస్తారోననే భయం అతడిలో పట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయి నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఖైదీని పోలీసులు వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా జైలులో ఉంటున్న ఆ ఖైదీని పోలీసులు.. డయాలసిస్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే, పోలీసులంటేనే వణికిపోతున్న ఆ ఖైదీ.. తాను రానంటే రానని మంకు పట్టు పట్టాడు. తనను ఎన్కౌంటర్ చేయబోమని హామీ ఇస్తేనే డయాలసిస్ చేయించుకొనేందుకు వస్తానని స్పష్టం చేశాడు. ఎన్కౌంటర్ లాంటిదేం జరగదని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ ఖైదీ వినిపించుకోలేదు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తాను ఇక్కడి నుంచి కదులుతానంటూ పేర్కొన్నాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నేరస్తుల్లో పోలీసులంటే ఎంతటి భయం ఉందో ఈ ఘటన నిరూపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'लिखकर दो कि रास्ते में गोली नहीं मारोगे…', यूपी के हरदोई में एनकाउंटर से डरे कैदी ने जमकर काटा बवाल#UPPolice #Hardoi #Prisoner #ATDigital pic.twitter.com/UmvZS87IVU
— AajTak (@aajtak) March 14, 2023
also read :
Rajamouli: అమెరికాలో ఇల్లు తీసుకున్న రాజమౌళి.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..!