Hometelanganamedico preethi case : మెడికో ప్రీతి కేసులో మరో మలుపు.. వైద్యులను విచారణ చేయాలి

medico preethi case : మెడికో ప్రీతి కేసులో మరో మలుపు.. వైద్యులను విచారణ చేయాలి

Telugu Flash News

medico preethi case : ర్యాగింగ్‌ భూతానికి బలైన మెడికో ప్రీతి కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ ప్రీతి తల్లిదండ్రులు చెబుతున్నారు. వైద్య శాఖ, డాక్టర్లపై వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌పైనా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమార్తె మృతిపై డీజీపీని కలిసేందుకు ప్రీతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అదనపు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ప్రీతికి జరిగిన వైద్యంపై మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ వాస్తవాలను దాచేస్తోందని ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుపుతున్న పోలీసులపై తమకు నమ్మకం ఉందని, కానీ ప్రీతికి వైద్యం చేసిన డాక్టర్లను విచారణ చేయాలని ప్రీతి తల్లిదండ్రులు అదనపు డీజీపీని కోరారు. ఇక ప్రీతి తల్లి శారద మీడియాతో మాట్లాడుతూ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. తన కుమార్తెపై జరిగిన వేధింపులను ఫోన్లో వివరంగా చెప్పిందని, చనిపోయే ముందు ప్రీతి తనకు కాల్‌ చేసిందని శారద తెలిపారు.

సైఫ్‌ వేధింపులపై భయం అవసరం లేదని ప్రీతికి దైర్యం చెప్పినట్లు శారద తెలిపారు. అప్పుడు తాను, తన కుమార్తె మాట్లాడిన ఆడియో వైరల్‌ అయ్యిందని తెలిపారు. సైఫ్‌తోపాటు మరికొందరు సీనియర్లు ప్రీతిని వేధించారని శారద చెప్పారు. వారి ప్రమేయం బయటపడుతుందనే అక్కసుతో ఈ కేసులో ఇరుక్కుంటామని ఫిక్స్‌ అయ్యి.. సైఫ్‌కు సపోర్టు చేస్తున్నారని శారద ఆరోపించారు. ప్రీతికి డయాలసిస్‌ చేయడంతో రక్తం మొత్తం పోయిందని, అప్పుడే ఎక్కించిన బ్లడ్‌ నుంచి టాక్సికాలజీ రిపోర్టుకు పంపించారని తెలిపారు. దీంతో నెగిటివ్‌ వచ్చి ఉండొచ్చని చెప్పారు.

తనపై వేధింపులకు పాల్పడుతున్న సైఫ్‌పై ప్రీతి ఫిర్యాదు చేసిందని తల్లి శారద తెలిపారు. సైఫ్‌ను లోపల ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీ విచారిస్తున్నప్పుడే ప్రీతి తనకు ఫోన్‌ చేసిందని… తనను వేధించకుండా ఉంటే చాలు.. సైఫ్‌ను సస్పెండ్‌ చేయాల్సిన అవసరం లేదని ప్రీతి తెలిపిందని శారద చెప్పారు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని అదనపు డీజీపీని కోరినట్లు శారద వెల్లడించారు. తన కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని ప్రీత తండ్రి నరేందర్‌ తెలిపారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ నివేదిక రాలేదని చెప్పారు. మట్టేవాడ పోలీసులు తన ఇంటికి వచ్చి విచారణ చేశారని తెలిపారు. వరంగల్‌లో ఘటన జరిగిన రోజే ఎంజీఎంలో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్టు సక్రమంగా వచ్చేదని చెప్పారు.

Also read : 

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

-Advertisement-

Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023

Nani: నాని మాస్ లైన‌ప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..!

punishments in hell : నరకాలు – అక్కడ అనుభవించవలసిన శిక్షలు ఏంటో తెలుసుకోండి..

Shruti Haasan hot and stylish black dress photos 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News