greece train accident : గ్రీస్ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 36 మంది సజీవ దహనం అయ్యారు. సుమారు 85 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ప్యాసింజర్ రైలు తెంపీ వద్ద ఎదురుగా వస్తున్న మరో కార్గో రైలును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయి. మరికొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఎగిరిపోయాయి.
ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. రైలు బోగీల్లో చెలరేగిన మంటల్లో 36 మంది సజీవ దహనం అయ్యారు. దుర్ఘటన జరిగిన సమయంలో రైల్లో 350 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీకటి పడటం, మంటలు భారీగా వ్యాపిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అక్కడి స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. రైలు ప్రయాణికుల్లో ఎక్కువ శాతం కాలేజీలో చదివే విద్యార్థులే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ హాలిడేను ముగించి ఇళ్లకు తిరిగి వెళ్లతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగులు కూడా మృతి చెందారు. నలుగురు లోకో పైలెట్లు ఉన్నట్లు గ్రీక్ రైల్ రోడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వెల్లడించారు. రైలు పెట్టెల శిథిలాలను పక్కకు తీస్తూ మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు క్షతగాత్రులను కూడా బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు.
ఈ దుర్ఘటన అత్యంత భయానమైందని, చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ కోరుతున్నట్లు గ్రీస్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని గ్రీక్ ప్రధాని సందర్శించారు. ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ.. తమకు ఎదురైన భయానక అనుభవాలను మీడియాకు పంచుకున్నారు. ప్రయాణికులంతా భయంతో వణికిపోయారని తెలిపారు. ప్రమాదానికి కారణాలేంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
also read :
Sreeleela : క్షమాపణలు చెప్పిన నటి శ్రీలీల.. కారణం ఏంటి?
Malavika Mohanan Latest Stills, Images,Instagram Photos 2023
kangana ranaut tweet : ఆ హీరోయిన్స్ లాగా రాత్రుళ్లు హీరోల రూమ్స్‌కి వెళ్లలేదు
Curd with Sugar : పెరుగులో చక్కెర కలిపి తింటే ప్రమాదమా?