బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కలిసి ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. చార్జ్‌షీట్‌లో వివరాలు పొందుపర్చి కోర్టుకు సమర్పించింది సీబీఐ.
రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు రాకుండా అత్యంత వ్యూహాత్మకంగా సీబీఐ అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ముఖ్య నేతలను నేరుగా అరెస్టు చేయకుండా వారి సహాయకులను, చుట్టుపక్కల వారిని మొదట అరెస్టు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం ఉందని సీబీఐ పేర్కొంటోంది. ఇప్పటికే కవిత ఇంటికి వచ్చిన అధికారులు ఆమెను విరాచణ చేశారు. ఇప్పటి వరకు కవితకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించిన అభిషేక్ బోయినపల్లి, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అదుపులోకి తీసుకుంది.
గతేడాది డిసెంబర్లో సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి కవితను సుమారు ఏడు గంటలకుపైగా విచారణ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆమెకు కీలక ప్రశ్నలు సంధించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని అప్పట్లోనే సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్టు చేసింది. రాఘవ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను సీబీఐ వెల్లడించింది.
మరోవైపు లిక్కర్ స్కాంపై గతంలో వేసిన చార్జ్‌షీట్లలోనూ ఎమ్మెల్సీ కవిత పేరును ఇందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే కవితకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కవిత పేరుమరోసారి తెరపైకి రావడంతో తాజా పరిణామాలపై రాజకీయ రచ్చ మొదలైంది. ఈసారి నేరుగా ఢిల్లీకి పిలిపించి విచారణ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విచారణ తదుపరి చర్యల్లో భాగంగా కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
also read:
Womens T20 World Cup 2023 : పాకిస్తాన్‌తో విక్టరీతో భారత్ సరికొత్త రికార్డు.. దంచేసిన జెమీమా!
Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot
నయనతార పబ్లిక్‌లో షారూఖ్‌కి ఇలా ముద్దు పెట్టేసిందేంటి?