Bandi Sanjay : తెలంగాణలో కొందరు నేతల వ్యాఖ్యలు అదుపు తప్పుతున్నాయి. అధికార పక్షంపై పైచేయి సాధించడానికి ప్రతిపక్షాలకు చెందిన నేతలు శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నారు. డామినేషన్ కోసం తహతహలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు జోరు పెంచారు. పాదయాత్రల ట్రెండ్ నడుస్తూనే బహిరంగ సభలు, సమావేశాల్లో నేతలమాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టాలని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. ఇక అధికార పార్టీపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో మార్పలు తెస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కొత్త సెక్రటేరియట్‌ను రూపాంతరం చేస్తామన్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ డోమ్‌లు కూల్చేస్తామని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌ను కూడా ప్రజాదర్బార్‌గా మారుస్తామన్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరువకముందే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం ముదురుతోంది.
మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు దమ్ముంటే పాతబస్తీ నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని సవాల్ చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంఐఎంకు కట్టబెట్టాలని చూస్తున్నారన్న బండి సంజయ్.. బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎంఐఎంతోకలిసి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామన్నారు. తెలంగాణలో నిజాం పాలన పోవాలని బండి చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ ఇవ్వడం లేదని, పొలాలు ఎండిపోతున్నాయన్నారు.
also read:
Viral Video: పెళ్లిలో పన్నీర్ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!
Rashmi Gautham: ఈ సారి రష్మీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతుందా ?