Jaggery face pack : ముఖంపై ముడతల సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. బెల్లంతో ముఖంపై ముడతలను మటుమాయం చేసుకోవచ్చు. బెల్లంతో చేసిన ఫేస్‌వాష్ వల్ల ముఖంపై ముడతలను కనిపించకుండా చేసుకోవచ్చు.
1. బెల్లం ముక్కను తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. సరిపడా నీరు పోసి కాసేపు మరిగించాలి.
2. గిన్నెలో బెల్లం కరిగిపోయిన తర్వాత ఓ టీస్పూను శనగపిండిని కలపాలి.
3. మరో టీస్పూను పెరుగు వేసి మిక్స్ చేయాలి. అనంతరం స్పూన్‌తో కలుపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని ఫేస్‌పై అప్లై చేసుకోవాలి. ఏడు నిమిషాల పాటు గుండ్రంగా మర్దన చేసుకోవాలి.
5. సుమారు 20 నిమిషాల నుంచి అర గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
6. తర్వాత క్లీన్‌గా ముఖాన్ని తుడుచుకొని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా పూసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయాలి.
7. ముఖంపై నల్లటి గీతల్లా కనిపించే ముడతలు మటుమాయం అవుతాయి.
also read news :
Rama Prabha: వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు..
Viral video : న్యూజిలాండ్‌లో వరద నీటిలోనూ బస్సు వేగం. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు