Kakani Govardhan Reddy news : నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు కలకలం రేపుతోంది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొడాలినాని సహా వైసీపీ ముఖ్య నేతలంతా ఆయనపై విరుచుకుపడ్డారు.
ఈరోజు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి ఆరోపణలను కొట్టిపారేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని చెబుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
న్యాయస్థానాలను ఎందుకు అప్రోచ్ కాలేదని నిలదీశారు. కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ అంటూ మంత్రి కాకాణి సెటైర్లు వేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్రాప్‌లో శ్రీధర్‌రెడ్డి పడిపోయారని కాకాణి స్పష్టం చేశారు.
అది ఫోన్ ట్యాపింగ్కాదు.. కాల్ రికార్డింగ్ అని శ్రీధర్‌రెడ్డి మనస్సాక్షికి తెలుసని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కోటంరెడ్డి మాట్లాడుతున్న వాటికి టీడీపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారని, తనకు అవమానం జరిగిందని భావిస్తే దానిపై స్పందించకపోగా.. 2024లో టీడీపీ తరఫున పోటీ చేస్తానంటూ ఆడియో క్లిప్‌లో ఎందుకు మాట్లాడారని కోటంరెడ్డిని కాకాణి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో జగన్‌ను చూసి మాత్రమే ప్రజలు ఓట్లేశారన్న కాకాణి.. ఎమ్మెల్యే పదవి జగన్ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు.
జగన్‌కు వీరవిధేయుడినని చెప్పుకున్న కోటంరెడ్డి.. ఇప్పుడు వేరే వాళ్లకు విధేయుడయ్యాడని కాకాణి విమర్శించారు. ఎమ్మెల్యేపదవి జగన్ పెట్టిన భిక్ష కాదా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు పార్టీని వీడినా జగన్ చెక్కుచెదరలేదని, ఇప్పుడు ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా పోయేదేమీ లేదని కాకాణి స్పష్టం చేశారు.
కోటంరెడ్డి పార్టీ మారడం అనేది ఆత్మహత్యా సదృశమని కాకాణి పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులోపడి జగన్‌పై విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి తీరును ప్రజలు హర్షించరని చెప్పారు.
also read news :
Baby in Brazil : బాలభీముడికి జన్మనిచ్చిన మహిళ! ఎంత బరువు ఉన్నాడంటే..
Eesha Rebba Latest Photos in Yellow dress
MS Dhoni Police Officer Look : పోలీస్ అవతారం ఎత్తిన మహేంద్రసింగ్ ధోని..