Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ఈ చిట్కాలను పాటించి చూడండి..
- ఎలాంటి చర్మతత్వం వాళ్ళయినా రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇందుకోసం సబ్బును ఉపయోగించకండి. సబ్బులో ఉండే రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి.
- మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో బాగా మగ్గిన అరటిపండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్కులా పట్టించి అరగంట తరువాత కడుక్కోవాలి.
- పది చుక్కల నువ్వుల నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ లో రెండు టేబుల్ స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడి చర్మం గలవారికి బాగా పనిచేస్తుంది.
- రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బియ్యప్పిండిని కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో వేళ్ళతో వలయాలుగా చుడుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఎక్కువ మసాజ్ చేస్తే చర్మం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. వారంలో మూడుసార్లు ఈ విధంగా చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి.
- పుదీనా పేస్ట్ లో బాదంనూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత వేడినీటిని కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాల తరువాత కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మకాంతి పెరుగుతుంది.
మరిన్ని అందమైన వార్తలు చదవండి :
pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా తగ్గించుకోండి..!
మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?
దానిమ్మ గింజల్లాంటి దంతాలు మీ సొంతం కావాలంటే ఈ టిప్స్ పాటించండి..
-Advertisement-