Sruthi Hassan: కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ ప్రస్తుతం ఫుల్ ఖుష్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు కారణం ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు పెద్ద విజయాలు సాధించడమే. స్టార్ కిడ్‌గా వచ్చినప్పటికీ తనలోని అన్ని టాలెంట్లను బయటకు తీసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్ల విషయంలోనూ తెగ హైలైట్ అవుతూ ఉంది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది.
ఓ సంద్భంలో అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. వీళ్లంతా కలిసి ఓ వివాహ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి జరగబోతుందని కూడా టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం నడుపుతూ తరచూ అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల గోపిచంద్, శృతి హాసన్ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై గోపీచంద్ మాట్లాడుతూ.. శృతిహాసన్ కి ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్.. లవ్ యూ చెప్పిన గోపీచంద్ ని అన్నయ్య అని పిలిచింది. అయినప్పటికీ ట్రోలర్స్ వదల్లేదు.ఈ వార్తలపై తాజాగా గోపీచంద్ స్పందిస్తూ.. ‘శృతితో నేను మూడు సినిమాలు చేశాను. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి. ఆమెతో నాకు బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ ఉంది. అదే లవ్ ని నేను స్టేజ్ పై చెప్పాను. కాని సోషల్ మీడియాలో వాటిని వేరేలా ప్రొజెక్ట్ చేశారు.. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను. శృతితో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.’ అని చెప్పుకొచ్చిన గోపిచంద్ పుకార్లకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు