Homeandhra pradeshSriharikota News : జవాను ఆత్మహత్య.. జవాను భార్య కూడా.. శ్రీహరికోటలో తీవ్ర విషాదం.. అసలేం జరుగుతోంది ?

Sriharikota News : జవాను ఆత్మహత్య.. జవాను భార్య కూడా.. శ్రీహరికోటలో తీవ్ర విషాదం.. అసలేం జరుగుతోంది ?

Telugu Flash News

Sriharikota News: రాకెట్‌ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ వరుస ఆత్మహత్యలతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. కేవలం ఒకరోజు వ్యవధిలోనే కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఆత్మార్పణ చేసుకున్నారు. ఈ ఘటనలు మరువకముందే మరో విషాదం నెలకొంది. సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ వికాస్‌ సింగ్‌ భార్య ప్రియా సింగ్‌ (27) బలవన్మరణం పొందింది. శ్రీహరికోటలోని నర్మద అతిథిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వరుసగా మూడు ఆత్మహత్యలతో శ్రీహరికోటలో విషాద ఛాయలు అలముకున్నాయి. సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదంటున్నారు. సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ వికాస్‌సింగ్‌ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతి విషయాన్ని ఇక్కడి అధికారులు తెలియజేయగానే ఉత్తరప్రదేశ్‌లో నివాసం ఉంటున్న ఆయన సతీమణి ప్రియా సింగ్‌ హుటాహుటిన శ్రీహరికోటకు బయల్దేరి వచ్చారు.

ఆమెతో పాటు అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న తర్వాత భర్త మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించింది ప్రియాసింగ్‌. అనంతరం మంగళవారం నర్మద గెస్ట్‌ హౌస్‌లో ఆమె బస చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఆమె గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

ముగ్గురు పసికందులను వదిలి..

తన భర్త ఆత్మహత్యతో ప్రియాసింగ్‌ తీవ్రంగా మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. భర్త మృతిని తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలుస్తోంది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వికాస్‌ సింగ్‌, ప్రియా సింగ్‌దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకటో క్లాస్‌, కుమార్తె ఎల్‌కేజీ, మరో పసిపాప ఉన్నారు. వీరిలో ఓ పాప వికలాంగురాలని తెలుస్తోంది. అయితే, వికాస్‌ సింగ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతను ముంబై నుంచి గత నవంబర్‌లో ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. 2015 బ్యాచ్‌కు చెందిన ఆయనపై ఇటీవల క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

also read:

Suma: పెళ్లైన సుమ‌ని ఆ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌పోజ్ చేశాడా… రియాక్ష‌న్ ఏంటంటే..!

-Advertisement-

pakistan news : భారత్ తో తాము చేసిన తప్పును తెలుసుకున్నామని పాక్ ప్రధాని

Bengaluru News : రోడ్డుపై 71 ఏళ్ల పెద్ధాయన్ని ఈడ్చుకెళ్లిన యువకుడు.. వైరల్ వీడియో

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News