Homeviral newsViral video : మహిళా కార్యకర్తను తదేకంగా చూస్తున్న సిద్ధరామయ్య.. వీడియో వైరల్‌

Viral video : మహిళా కార్యకర్తను తదేకంగా చూస్తున్న సిద్ధరామయ్య.. వీడియో వైరల్‌

Telugu Flash News

Viral video: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ప్రసంగాలు, చేష్టలతో పలు వివాదాస్పద అంశాల్లోనూ నిలుస్తుంటారు. తాజాగా కర్ణాటకలో ఆయన ప్రవర్తించిన తీరుపై ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, కాంగ్రెస్‌ కార్యకర్తలు విపరీతంగా ఈ వీడియోను షేర్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సోమవారం బెంగళూరు నగరంలోని ప్యాలెస్‌ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నా నాయకి సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మహిళా నేతలు ఈ కార్యక్రమానికి సారధ్యం వహించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేతలతో కలిసి వేదికపైకి వచ్చిన సిద్ధరామయ్య.. మహిళా నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసంగం చేశారు.

వేదిక దిగిపోవడానికి వెళ్తూ సిద్ధరామయ్య.. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ మీడియా ప్రతినిధి లావణ్య బల్లాల్‌కు కాస్త దగ్గరగా వచ్చి తదేకంగా చూస్తూ వెనుదిరిగారు. అనంతరం విక్టరీ సింబల్‌ చూపుతూ వేదిక నుంచి కిందకు వచ్చారు సిద్ధరామయ్య. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు షేర్‌ చేశారు. దీనిపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ వైరల్‌ వీడియోపై లావణ్య బల్లాల్‌ స్పందించింది.

నన్ను కూతురిలా చూసుకుంటున్నారు..

ఆమె కూడా ఈ వీడియోను స్వయంగా తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తూ.. ప్రజలు ఏమనుకున్నా సిద్ధరామయ్య తనను ఆయన కూతురిలా చూసుకుంటున్నారనేది నిజమని స్పష్టం చేశారు. తమ మధ్య తండ్రీ తనయల అనుబంధం ఉందని తెలిపారు. మరోవైపు దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. తాను ఏం చేసినా ట్రెండింగ్‌ కంటెంట్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. మెన్‌ విల్‌ బీ మెన్‌.. అంటూ మీమర్స్‌ తమ క్రియేటివిటీకి పని చెప్పారు. తన కళ్ల ముందు గర్వంగా ఎదుగుతున్న కూతురిని చూడటం ఓ అందమైన దృశ్యం.. అంటూ సుమన కిత్తూరు కామెంట్‌ చేశారు. ఏది ఏమైనప్పటికీ సిద్ధరామయ్య కనిపించిన తీరు బాగుంది.. అంటూ గిరీష్‌ పూజారి వ్యాఖ్యానించారు.

also read:

-Advertisement-

BRS : ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తారా?

NTR: జూనియర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్స్.. పిక్ అదిరిపోలా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News