ఉక్రెయిన్ (Ukraine) కి రష్యా (Russia) కి మధ్య యుద్ధం మొదలై ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో ఈ యుద్ధం కారణంగా ఇరుదేశాలకు నష్టాలు జరిగాయి. ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది. రష్యా ఉక్రెయిన్ కి చెందిన కొన్ని ప్రాంతాలను చేజిక్కించుకుంది. ఉక్రెయిన్ రష్యాకి ఎదురు తిరిగి ఆ ప్రాంతాలను సమర్థవంతంగా తిరిగి తీసుకుంది.ఈ యుద్ధం ఆపడానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి అని అంటూ మాటలు వినిపిస్తున్నపటికీ అది మాత్రం కార్యరూపం దాల్చట్లేదు.
అయితే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నష్ట పోతుందని అనుకున్నారంతా. కానీ ఒక సర్వే ప్రకారం రష్యానే ఎక్కువ నష్టపోతుందని,తెలిసి తెలిసి ఈ యుధ్ధం రూపంలో రష్యా తన గొయ్యి తానే తొవ్వుకుంటుందని వెల్లడైంది.
గ్లోబల్ స్ట్రాటజీస్ట్ (Global strategist) అండ్ అనలిస్ట్ సర్వే ప్రకారం అంతర్జాతీయ సమాజం ముందు రష్యా “ఓ ఫెయిల్యూర్ నేషన్” గా నిలబడాల్సి వస్తుందని తేలింది.
రాబోయే పదేళ్లలో అంటే 2033 సంవత్సరం కల్లా రష్యా పతనం తప్పదని దాదాపు 46% మంది ఓటు వేసినట్టుగా అంట్లాంటిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సర్వే ద్వారా తేలింది.ఈ యుద్ధం కారణంగా పోయిన ఏడాదితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ 30% మేర పతనం అయ్యినట్టు తేలింది.
రష్యా (Russia) కొత్త పథకాలను ఆలోచిస్తుంది- జెలెన్స్కీ
ప్రతి ఏడాది జనవరి 6,7 తేదీలలో ఉక్రెయిన్, మరియు రష్యా ఇరు దేశాలలో క్రిస్టియన్లు క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ జనవరి 6న 12 గంటల పాటు ఉక్రెయిన్ పై ఎవరూ దాడి చేయవద్దని చెప్పారని రష్యా ప్రతినిధులు చెప్పారు.
ఆర్థోడాక్స్ చర్చ్ హెడ్ విజ్ఞప్తి మేరకు పుతిన్ ఈ సూచనలు ఇచ్చారని తెలిపారు. అయితే ఉక్రెయిన్ పై మరింత సైన్యాన్ని మోహరింపచేయడానికే ఈ విరామాన్ని తీసుకున్నారని, ఈ ప్రకటన చేయడంలో పుతిన్ సానుభూతి ఏమీ లేదని జెలెన్స్కీ ఆరోపించారు.
తూర్పు డాన్బాస్ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని అణిచేందుకు అదనపు బలగాలు, ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని, దీన్ని కాల్పుల విరమణ అని కవర్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ పై పై సానుభూతి వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని, మళ్లీ రష్యా దాడులు కొనసాగుతాయని,ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారని అసహనం వ్యక్తం చేశారు.పుతిన్ చెప్పే మాటలను నమ్మలేమని జెలెన్స్కీ మండిపడ్డారు.
ఇప్పటికే 50 వేల మంది సైనికులను యుద్ధ రంగంలో మొహరించినట్టు పుతిన్ ప్రకటించారు. ఇంకో రెండున్నర లక్షల మందిని సిద్ధం చేసి ఎప్పుడైనా ఉక్రెయిన్ ను ఆక్రమిస్తామని సంకేతాలిస్తున్నారు.
అయితే అక్కడ ప్రస్తుతం శీతాకాలం కావడంతో రష్యన్ సైనికులు చలి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తుండగా.. యుద్ధరీతిలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ యుద్ధం వల్ల నష్టం జరుగుతుందని,రష్యా పతనం తప్పదని తెలిసిన పుతిన్ యుద్దాన్ని ఆపుతాడా? లేక తన వైఖరిని ఇలాగే కొనసాగిస్తాడా? యుద్ధం ముగిసే సమయానికి ఇరు దేశాల పరిస్థితి ఏమి అవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది.
Also Read:
Chiranjeevi: సుమన్‌ని జైల్లో పెట్టించింది చిరునా.. అసలు కారణం చెప్పిన మెగాస్టార్
Waltair Veerayya movie review : ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ